Telugu Global
Telangana

తెలంగాణ సీఎంవో వాట్సాప్‌ ఛానల్‌..!

ఆసక్తి ఉన్న వారు తెలంగాణ సీఎంవో వాట్సాప్ ఛానల్‌ను ఫాలో కావొచ్చు. ఈ నెల 14న ఈ ఛానల్ క్రియేట్ చేయగా.. ఇప్పటివరకూ 46 వేల మందికిపైగా ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు.

తెలంగాణ సీఎంవో వాట్సాప్‌ ఛానల్‌..!
X

రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలు చేరవేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువకావాలని నిర్ణయించింది. ఇప్పటివరకూ అధికారిక సమాచారం చేరవేసేందుకు సోషల్‌మీడియా వేదికలను ఉపయోగించుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా తెలంగాణ సీఎంవో పేరిట వాట్సాప్ ఛానల్‌ను ప్రారంభించింది. ఈ వాట్సాప్ ఛానల్ ద్వారా ప్రభుత్వం విడుదల చేసే ప్రకటనలు, సమాచారాన్ని పొందవచ్చు.

ఆసక్తి ఉన్న వారు తెలంగాణ సీఎంవో వాట్సాప్ ఛానల్‌ను ఫాలో కావొచ్చు. ఈ నెల 14న ఈ ఛానల్ క్రియేట్ చేయగా.. ఇప్పటివరకూ 46 వేల మందికిపైగా ఈ ఛానల్‌ను ఫాలో అవుతున్నారు. పాలమూరు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియోతో పాటు వివరాలను ఇందులో పోస్టు చేశారు.

ఈ నెల 13 నుంచి ఈ సదుపాయాన్ని తీసుకువచ్చింది వాట్సాప్. ఇండియాతో పాటు 150 దేశాల్లో వాట్సాప్‌ ఛానల్స్‌ను ప్రారంభించింది. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ, పలువురు సినీ ప్రముఖుల పేరిట ఛానల్స్ వచ్చాయి.

*

First Published:  21 Sep 2023 3:08 AM GMT
Next Story