Telugu Global
Telangana

లైఫ్ సైన్సెస్ రంగం విలువను రూ. 20.5 లక్షల కోట్లకు తీసుకెళ్ళడమే తెలంగాణ లక్ష్యం -కేటీఆర్

హైదరాబాద్ లో బయోఏషియా 2023, 20వ ఎడిషన్‌ను శుక్రవారం కేటీఆర్ ప్రారంభిస్తూ, దేశంలోని 14 శాతం సగటుతో పోలిస్తే తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం గత కొన్నేళ్లుగా 23 శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు.

లైఫ్ సైన్సెస్ రంగం విలువను రూ. 20.5 లక్షల కోట్లకు తీసుకెళ్ళడమే తెలంగాణ లక్ష్యం -కేటీఆర్
X

2030 నాటికి ఇక్కడి లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ విలువను 250 బిలియన్ డాలర్లకు (రూ. 20.5 లక్షల కోట్లు) తీసుకెళ్లాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుంది. 2028 నాటికి రాష్ట్రం 100 బిలియన్ డాలర్లకు (8.2 లక్షల కోట్లు) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది ఇప్పటికే 80 బిలియన్ డాలర్లకు (రూ. 6.56 లక్షల కోట్లు) చేరుకుంది. దీన్ని బట్టి తమ లక్ష్యాన్ని 2025 నాటికి సాధించగలమని, నిర్దేశించిన లక్ష్యం కంటే మూడేళ్లు ముందుగానే సాధిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ లో బయోఏషియా 2023, 20వ ఎడిషన్‌ను శుక్రవారం కేటీఆర్ ప్రారంభిస్తూ, దేశంలోని 14 శాతం సగటుతో పోలిస్తే తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం గత కొన్నేళ్లుగా 23 శాతం వృద్ధిని సాధిస్తోందని అన్నారు.

తెలంగాణ, భారతదేశంలో లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అభివృద్ధిలో బయోఏషియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. ఈ అత్యుత్తమ ప్లాట్‌ఫారమ్ 100 కంటే ఎక్కువ దేశాల నుండి ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాలను ఆకర్షిస్తోందని కేటీఆర్ చెప్పారు.

లైఫ్ సైన్సెస్, ఫార్మా, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రాముఖ్యతను గుర్తించడంలో తెలంగాణ ముందుంది. భారత్ లో విస్తరిస్తున్న‌ జీనోమ్ వ్యాలీ, మెడ్‌టెక్ పార్క్, రాబోయే ఫార్మా సిటీ ఉన్న ఏకైక నగరం హైదరాబాద్. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది అని కేటీఆర్ తెలిపారు

“ 2025 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని షెడ్యూల్ కంటే ఐదేళ్ల ముందుగానే సాధిస్తామని నేను విశ్వసిస్తున్నాను. ఇది జరగడానికి కలిసి వచ్చిన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని కేటీఆర్ అన్నారు.

గత 7 సంవత్సరాలలో రాష్ట్రం 3 బిలియన్ డాలర్ల‌ కంటే ఎక్కువగా కొత్త పెట్టుబడులను ఆకర్షించగలిగింది. ఇదే కాలంలో తెలంగాణలో మొత్తం 4.5 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని కేటీఆర్ చెప్పారు.

‘‘ప్రపంచ లైఫ్ సైన్సెస్ పరిశ్రమకు తెలంగాణను నాలెడ్జ్ క్యాపిటల్‌గా మార్చడమే మా అంతిమ లక్ష్యం. ఇందులో కీలకమైన అంశం లైఫ్ సైన్సెస్ సేవల రంగం వృద్ధి. మేము ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1,000 కంటే ఎక్కువ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు సేవలందిస్తున్నాము. వాటిలో టాప్ 10 ఫార్మా కంపెనీలున్నాయి. ”అని ఆయన అన్నారు.

ప్రపంచంలోనే మూడింట ఒకవంతు వ్యాక్సిన్ల ఉత్పత్తి తెలంగాణలో జరుగుతున్నదని కేటీఆర్ తెలిపారు. దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం, ఏపీఐ ఉత్పత్తిలో 40 శాతం, ఏపీఐ ఎగుమతుల్లో 50 శాతం తెలంగాణ నుంచే జరుగుతున్నదని ఆయన చెప్పారు.

First Published:  24 Feb 2023 9:49 AM GMT
Next Story