Telugu Global
Telangana

మొన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ కేసీఆర్‌.. బిగ్‌ డిబేట్‌పై జనాల్లో ఆసక్తి

కార్యక్రమంలో కేసీఆర్‌ సంచలన విషయాలను వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దికాలం క్రితమే తాను టీవీ లైవ్‌ షోలో పాల్గొంటానని, అనేక విషయాలను వెల్లడిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.

మొన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ కేసీఆర్‌.. బిగ్‌ డిబేట్‌పై జనాల్లో ఆసక్తి
X

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఇవాళ టీవీ-9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొనబోతున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ-9 ఎండీ, యాంకర్‌ రజనీకాంత్‌ నిర్వహించనున్నారు. దాదాపు పుష్కర కాలం తరువాత టీవీ-9 లైవ్‌ షోలో కేసీఆర్‌ పాల్గొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రేపటి నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్‌ డిబేట్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

కార్యక్రమంలో కేసీఆర్‌ సంచలన విషయాలను వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొద్దికాలం క్రితమే తాను టీవీ లైవ్‌ షోలో పాల్గొంటానని, అనేక విషయాలను వెల్లడిస్తానని కేసీఆర్‌ ప్రకటించారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఈ మధ్యే నేషనల్‌ న్యూస్ చానెల్స్ అయిన టైమ్స్‌ నౌ, ఇండియా టీవీలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తుపాకీ రెడీగా ఉంది సింహం బయటిరాని ఒకేఒక బుల్లెట్ చాలూ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డికి కేసీఆర్‌ గట్టిగానే బదులు ఇస్తారని టాక్. దీంతో టీవీ-9 షో కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

First Published:  23 April 2024 7:50 AM GMT
Next Story