Telugu Global
Telangana

ఈరోజు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో కేసీఆర్ పర్యటన, కలెక్టరేట్‌ సముదాయాల ప్రారంభం

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు కొత్త ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లను ప్రారంభించడంతో పాటు ఈ రెండు జిల్లాల్లోని భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.

ఈరోజు మహబూబాబాద్, భద్రాద్రి  జిల్లాల్లో కేసీఆర్ పర్యటన, కలెక్టరేట్‌ సముదాయాల ప్రారంభం
X

రెండు సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను గురువారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండు కొత్త ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లను ప్రారంభించడంతో పాటు ఈ రెండు జిల్లాల్లోని భారత రాష్ట్ర సమితి జిల్లా పార్టీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు రెండు జిల్లాల అభివృద్ధి నిధులతో సహా ముఖ్యమంత్రి పలు ప్రకటనలు చేయనున్నారు. సమీకృత కలెక్టరేట్ సముదాయాలను ప్రారంభించిన అనంతరం. రెండు జిల్లాల్లో ఒకేరోజు కలెక్టరేట్‌ సముదాయాలను ముఖ్యమంత్రి ప్రారంభించడం ఇదే తొలిసారి.

షెడ్యూల్ ప్రకారం, కేసీఆర్ హైదరాబాద్ నుండి ఉదయం 10 గంటలకు మహబూబాబాద్ చేరుకుని అక్కడ BRS పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, తరువాత 11 గంటలకు IDOC ప్రారంభోత్సవం చేస్తారు. కలెక్టరేట్‌లో ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి ఆయన జిల్లా ప్రగతిని సమీక్షిస్తారు.

మధ్యాహ్నం 2 గంటలకు కొత్తగూడెం వెళ్లి అక్కడ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, అనంతరం కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యి ఆయన జిల్లా ప్రగతిని సమీక్షిస్తారు.

మరోవైపు నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట, మంచిర్యాలు, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, కరీంనగర్ తదితర జిల్లాల్లో మరో తొమ్మిది సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయాలు నెల రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ములుగు, నారాయణపేట జిల్లాల్లో ఇటీవల ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ల నిర్మాణం ప్రారంభం కాగా, ఆదిలాబాద్‌లో భవన నిర్మాణం టెండర్ల దశలో ఉంది, వరంగల్ కలెక్టరేట్ కోసం భూమి ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 18 న ఖమంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగ సభనిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నారు. అదే రోజు ముఖ్యమంత్రి కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించనున్నారు.

First Published:  12 Jan 2023 2:18 AM GMT
Next Story