అక్క‌సు ప‌ట్ట‌లేక‌పోతున్న టీడీపీ

114

నంద్యాలలో ఉప ఎన్నిక ముగిసినా ఉప‌ద్ర‌వం స‌మ‌సిపోలేదు… అక్క‌డ ఓట్ల గోల ముగిసినా ఉద్రిక్త‌త కొన‌సాగుతూనే ఉంది… భారీ పోలింగ్ జ‌ర‌గ‌డంతో వైసీపీ విజ‌యం ఖాయం అని అంచనాలు రావ‌డంతో టీడీపీ నేత‌లు అక్క‌సు ప‌ట్ట‌లేక‌పోతున్నారు…. వైసీపీ నేత‌ల‌పై ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు… తాము ఓడిపోతున్నామ‌న్న భ‌యం, బాధ‌, కోపం, ద్వేషంతో ఉన్మాదుల్లా త‌యారైన టీడీపీ నేత‌లు ఇప్పుడు వైసీపీ నేత‌ల‌పై ఏకంగా హ‌త్యా య‌త్నానికే తెగ‌బ‌డ‌డం నంద్యాల ఓట‌ర్ల‌ను నిర్ఘాంత ప‌రుస్తోంది… నిన్న పోలింగ్ డే నాడు బ‌రితెగించి వైసీపీ నేత‌ల‌పై బ‌హిరంగంగా దాడులు చేసిన టీడీపీ నేత‌లు… ఇప్పుడు మ‌రింత నీచానికి తెగ‌బ‌డుతున్నార‌ని నంద్యాల జ‌నం విమ‌ర్శిస్తున్నారు.

తాజాగా శిల్పా చక్ర‌పాణిరెడ్డిపై టీడీపీ నేత‌, రౌడీ షీట‌ర్ అభిరుచి మ‌ధు  గ‌న్ను ఎక్కుపెట్టారు… ఆయ‌నే ల‌క్ష్యంగా 5 రౌండ్ల కాల్పులు జ‌రిపారు… అంతేకాదు వేట కొడ‌వ‌ళ్ల‌తో వీరంగం వేశారు.. శిల్పా చ‌క్ర‌పాణిపై హ‌త్యా య‌త్నం జ‌ర‌గ‌డంతో వైసీపీ శ్రేణులు నిర్ఘాంత‌పోయాయి.. మైనారిటీ నేత అంత్య‌క్రియ‌ల‌కు శిల్పా వెళ్లి వ‌స్తుండ‌గా హోట‌ల్ సూర‌జ్ గ్రాండ్ ద‌గ్గ‌ర ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. వైసీపీ విజ‌యం సాధిస్తుంద‌నే ఆలోచ‌న ఆగ్ర‌హంగా మారి టీడీపీ నేత‌ల‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను ఉన్మాదులుగా మారుస్తోంద‌ని మేధావులు, సీనియ‌ర్ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు… ఇప్పుడే టీడీపీ ఇలా బరితెగిస్తే రేపు ఎన్నిక‌ల ఫ‌లితం వైసీపీకి అనుకూలంగా ఉంటే నంద్యాల‌లో ఎంత ర‌ణరంగం సృష్టిస్తుందో, ఎంత భ‌యాన‌క బీభ‌త్స వాతావ‌ర‌ణం క్రియేట్ చేస్తుందో అని నంద్యాల జ‌నంతో పాటు విప‌క్షాలు కూడా వ‌ణికిపోతున్నాయి… రాజ‌కీయాల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మేన‌ని ప్ర‌జాస్వామ్యం బ‌తికి బ‌ట్ట‌క‌ట్టాలంటే అధికార పార్టీ ఆగ‌డాల‌కు క‌ళ్లెం వేయాల‌ని ప్ర‌జాస్వామ్య‌వాదులు కోరుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES