అపచారం వల్ల…. మీకు దోషం తప్పదు – సిద్ధాంతి హెచ్చరిక

93

బెజవాడ దుర్గ గుడిలో మరో వివాదం రాజుకుంది. ఆలయ అధికారుల తీరుపై ఆస్థాన జ్యోతిష్యుడు మండిపడ్డారు. అధికారుల తీరును నిరసిస్తూ ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాశారు. వాస్తుకు విరుద్దంగా ఆలయంలో అధికారులు మార్పులు చేర్పులు చేస్తున్నారని లేఖలో సిద్ధాంతి వివరించారు. ఇలా చేయడం వల్ల పెను నష్టం తప్పదని హెచ్చరించారు. ఆలయంలో జరుగుతున్న దోషం రాజధాని అమరావతితో పాటు ముఖ్యమంత్రికి తగులుతుందని సిద్ధాంతి లేఖలో హెచ్చరించారు. సిద్దాంతి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి ఆలయ అధికారులపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

NEWS UPDATES

CINEMA UPDATES