అవివేకంగా తెరకెక్కిన వివేకం సినిమా

194

అజిత్ హీరోగా నటించిన వివేకం సినిమాపై భారీ అంచనాలున్నాయి. పరిశ్రమకొచ్చి పాతికేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా అజిత్ నటించిన సినిమా ఇది. అందుకే తమిళనాట ఈ సినిమా కోసం ఆడియన్స్ చాలా వెయిట్ చేశారు. అజిత్ ఫ్యాన్స్ అయితే మరీనూ. ఈ సినిమా కోసం కోలీవుడ్ లో 10 రోజుల ముందు నుంచే మిగతా సినిమాల రిలీజ్ లు ఆపేశారంటే క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

ఇంత క్రేజ్ తో వచ్చిన వివేకం సినిమా అందర్నీ డిసప్పాయింట్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్లో కథ, అదే స్థాయిలో టేకింగ్ ఉన్నప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో చేసిన తప్పులు వివేకంను ఓ సాధారణ చిత్రంగా మార్చేశాయి. దర్శకుడు శివ చేసిన పొరపాట్లు వివేకం సినిమాను ముంచేశాయి.

ఉన్నది ఉన్నట్టుగా అంతర్జాతీయ స్థాయిలో, టెక్నికల్ గా ఈ సినిమా తీస్తే బాగుండేది. కానీ తమిళ వాసనలు, పాత ఫార్ములాలు తగిలించి మూవీని చెత్త చేశారు. అప్పుడెప్పుడో వచ్చిన రవితేజ సినిమా వీడేలో వాడిన క్లయిమాక్స్ ను.. ఇలాంటి ఇంటర్నేషనల్ సినిమా కోసం వాడడం నిజంగా అవివేకం. ప్రస్తుతానికి ఈ మూవీ కోలీవుడ్ లో, ఓవర్సీస్ లో మంచి వసూళ్లు సాధిస్తోంది. తెలుగులో మాత్రం వివేకం ఆడడం కష్టమే.

NEWS UPDATES

CINEMA UPDATES