ఆ మందులు ఆడా మ‌గ‌ల‌కు ఒకేలా ప‌నిచేయ‌వు!

95

ఆడ‌వాళ్ల‌కు మ‌గ‌వాళ్ల‌కు వ‌చ్చే అనారోగ్యాలు చాలావ‌రకు ఒకేలాఉన్న‌ట్టే…వారికి వాడే మందులు సైతం ఒకేలా ఉంటాయి. అయితేనొప్పిని త‌గ్గించే పెయిన్ కిల్ల‌ర్స్‌, డిప్రెష‌న్‌కి విరుగుడుగా వాడేయాంటీ డిప్రెసెంట్స్‌…స్త్రీ పురుషుల‌కు ఒకేలా ప‌నిచేయ‌వ‌ని ఒకఅధ్య‌య‌నంలో తేలింది.  మ‌నిషి శ‌రీరంలో మందులు ప‌నిచేయ‌టంవిష‌యంలో వారిలోని హార్మోన్లు, జీన్స్ ప్ర‌భావం ఉంటుంద‌ని…ఇవిస్త్రీ పురుషుల్లో భిన్నంగా ఉంటాయి క‌నుక… మందులు ప‌నిచేసేవిధానం కూడా వేరుగా ఉంటుంద‌ని అద్య‌య‌నాన్ని నిర్వహించిన… డెబోరా క్లెగ్ అనే శాస్త్ర‌వేత్త అంటున్నారు. ఈమె అమెరికాలాస్ఎంజిల్స్‌లోని ఓ మెడిక‌ల్ సెంట‌ర్‌లో డ‌యాబెటిస్ ఒబెసిటీవిభాగాల్లో రీసెర్చి సైంటిస్టుగా ప‌నిచేస్తున్నారు.  

సాధార‌ణంగా మందుల‌పై ప‌రీక్ష‌లు నిర్వ‌హించేట‌పుడు, ప‌రిశోధ‌న‌లు చేసేట‌పుడు మ‌గ‌వారినే ఎక్కువ‌గా ఎంపికచేసుకుంటార‌ని, అవి ఆడ‌వారికి కూడా ఒకేతీరుగా ప‌నిచేస్తాయ‌ని భావిస్తార‌ని…కానీ ఇది స‌రికాద‌ని క్లెగ్ చెబుతున్నారు.

మ‌హిళ‌ల్లో రుతుక్ర‌మం స‌మ‌యంలో ఈస్ట్రోజ‌న్‌, పొజెస్టిరాన్ హార్మోన్లలో హెచ్చుత‌గ్గులుంటాయ‌ని…అవి ప‌రిశోధ‌న‌ల‌మీద ప్రభావం చూపుతాయ‌నేఉద్దేశంతో…  మ‌గ‌వారినే ఎంపిక చేసుకుంటార‌ని ఆమె వివ‌రించారు. అయితే శ‌రీరంలో ఫ్యాటీ ఆసిడ్లు ఆరోగ్యం మీద చూపించే ప్ర‌భావం, చెక్కెర‌ల‌నుజీవ‌క్రియ‌ల‌కు ఉప‌యోగించుకునే తీరు… వీట‌న్నింటిపై సెక్స్ హార్మోర్ల ప్ర‌భావం ఉంటుంద‌ని…అందుకే పెయిన్ కిల్ల‌ర్స్‌, యాంటీ డిప్రెసెంట్ మందులుస్త్రీ పురుషుల్లో భిన్నంగా ప‌నిచేసే అవ‌కాశం ఉంద‌ని ఆమె వెల్ల‌డించారు.

NEWS UPDATES

CINEMA UPDATES