ఏపీ బీజేపీకి కొత్త అధ్య‌క్షుడు వ‌స్తాడా?

85

బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌షా మ‌రోసారి ఆంధ్ర‌ప్రదేశ్‌లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలో ప‌ర్య‌టిస్తారు. ఈ సంద‌ర్భంగా పార్టీకి సంబంధించిన కీల‌క నిర్ణ‌యాలు అమిత్‌షా ప్ర‌క‌టించ‌బోతున్నారు. బీజేపీ సీనియ‌ర్ నేత వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్లారు. దీంతో ఇప్పుడు ఏపీలో బీజేపీకి కీల‌క నేత లేరు. దీంతో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అధ్య‌క్షుడిని ఈ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది. వెంక‌య్య‌నాయుడి వ‌ల్లే ఇన్నాళ్లు పార్టీ అధ్య‌క్ష‌ప‌ద‌వి పెండింగ్‌లో ప‌డింద‌ని ఓ ప్ర‌చారం ఉంది. దీంతో ఇప్పుడు పార్టీని ఓ గాడిలో పెట్టేందుకు అధ్య‌క్షుడి నియ‌మాకం త‌ప్ప‌నిస‌రి అని అమిత్‌షా భావిస్తున్నార‌ని తెలిసింది.

సోమువీర్రాజు పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ముందు ఉన్నారు. క‌మ‌లం బాస్  లెక్క‌లు మారితే మాత్రం పురంధేశ్వ‌రి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌లో ఎవ‌రో ఒక‌రు పార్టీ ప్రెసిడెంట్ అవుతార‌నేది ఒక టాక్‌. మ‌రోవైపు కేంద్ర‌మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగితే ఏపీ నుంచి ఒక‌రిద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ద‌క్కే అవకాశం క‌న్పిస్తోంది. మ‌రోవైపు రాబోయేరోజుల్లో పార్టీ చేప‌ట్టే కార్య‌క్ర‌మాలపై షా ఒక డైరెక్ష‌న్ ఇస్తార‌ని తెలుస్తోంది. బీసీ వ‌ర్గీక‌ర‌ణ క‌మిష‌న్‌తో పాటు ఇటీవ‌ల కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాల‌పై ప్ర‌చారానికి కార్య‌క్ర‌మాలు రూపొందించ‌బోతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES