''ఏరా… బట్టేబాజ్ గా'' – జగన్‌ను నోటికొచ్చినట్టూ తిట్టిన వేణుమాధవ్‌

467

కామెడి నటుడు వేణుమాధవ్‌ నోరు పారేసుకున్నాడు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి ప్రచార రథంపై ప్రసంగించిన వేణుమాధవ్‌…జగన్‌ను రేయ్‌.. బట్టేబాజ్ గా అంటూ దూషించారు. లేనిది ఉన్నట్టు చూపించే టీవీ ఛానళ్లు, పేపర్లు తనకు లేవని జగన్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వేణుమాధవ్‌… ”ఒకడు అంటున్నాడు. బుద్ధి లేనోడు. బుద్దిలేని మూర్ఖుడు. వాడికి ఛానల్‌ లేదంటా…. పేపర్‌ లేదంటా!. మరి ఆ పేపర్‌, ఆ ఛానల్‌ ఎవరిదిరా బట్టేబాజ్ గా” అంటూ దూషించాడు.

వేణుమాధవ్‌ ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు కూడా పక్కనే నిలబడి ఉన్నారు. చంద్రబాబు ప్రచారానికి వస్తానంటే తాను రావద్దని చెప్పానన్నారు. మెజారిటీని పేపర్లు, టీవీల్లో చూడాల్సిందిగా సూచించానన్నారు. కానీ ఒక్కసారి వస్తానని చంద్రబాబు ఇక్కడికి వచ్చారని వ్యాఖ్యానించారు. తాను నంద్యాల వస్తుంటే దారి పొడవునా ప్రొక్లయినర్లే కనిపిస్తున్నాయన్నారు.

మొత్తం మీద ఒక ప్రతిపక్ష నేతను ఉద్దేశించి ముఖ్యమంత్రి సమక్షంలోనే వేణుమాధవ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఒక నటుడు అయి ఉండి ఇంత సంస్కార హీనంగా మాట్లాడడం ఏమిటని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES