ఐరన్ లోపం కాకూడదు శాపం…

92

మన శరీరంలో 4గ్రాముల ఇనుము ఉంటుంది. అది ఎక్కువ భాగం రక్తంలో ఉంటే కొంత కాలేయంలో ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలలో ఉన్న హిమోగ్లోబిన్‌ తయారీకి ఇనుము అత్యవసరం. హిమో గ్లోబిన్‌ ‘ఆక్సిజన్‌’తో కలుస్తుంది.ఆక్సీహీమో గ్లోబిన్‌ గా మారి పోతుంది. జీవకణాలకు ఆక్సిజన్‌ అందిస్తుంది. మళ్ళీ హీమోగ్లోబిన్‌గా మిగిలి పోతుంది. కొన్ని ‘ఏంజైమ్‌’లు పనిచేయడానికి ఇనుముకావాలి.

మనం నిత్యం తీసుకునే ఆకుకూరలైన తోటకూర, పుదీన, మెంతి కూర, గోంగూరలు ఇనుము అందిస్తాయి. తృణ ధాన్యాలైన రాగులు, సజ్జల్లో ఇది ఎక్కువ. సోయాబీన్‌, సెనగపప్పు, పెసరపప్పు లాంటి పప్పుదినుసుల్లో కూడా ఇనుము ఉంది. ఆహారంలోఉండే విటమిన్‌-సి ఇనుము శోషించటానికి తోడ్పడుతుంది. మన శరీరంలో ఐరన్‌ లోపిస్తే ఎంత ప్రమాదకరమో అది ఎక్కువయినా అంతే సమస్య అంటున్నారు పరిశోధకులు.

క్తంలో ఐరన్‌ కొద్దిపాళ్లలో పెరిగినా మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందంటున్నారు. కొందరిలో ఇనుము ఎక్కువగా పేరుకోవడం అనువంశికంగా వస్తుంది. దీనివల్ల చాలామంది డయాబెటిస్ బారినపడతారు. ఈ సమస్య మహిళల్లోకన్నా మగవాళ్లలోనే ఎక్కువ. కాబట్టి మన శరీరంలోఇనుము శాతాన్ని బట్టి ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.  అప్పుడే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.

 

NEWS UPDATES

CINEMA UPDATES