ఒక్క సెన్సార్ కట్ కూడా లేకుండా రిలీజ్ అవుతున్న పైసా వసూల్….

843

బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో వస్తున్న  తాజా చిత్రం “పైసా వసూల్‌”. శ్రియ హీరోయిన్ గా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ యొక్క ఆడియో రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. అయితే “పైసా వసూల్” మూవీ రీసెంట్ గా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌ డ్రామా గా తెరకెక్కిన “పైసా వసూల్” కి  సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసింది. అసలు మూవీ లో ఒక్క కట్‌ కూడా లేకుండా సినిమాకు బోర్డు క్లియరెన్స్ రావడం ఫిలిం నగర లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సెన్సార్‌ వర్గాల టాక్ ప్రకారం నందమూరి  ఫ‍్యాన్స్‌ సరికొత్త బాలయ్యను చూడబోతున్నారట‌. అయితే టీజర్‌, ట్రైలర్‌ చూసిన చాలా మంది సినిమాకు చాలా వరకు కట్స్ తప్పదని భావించినప్పటికీ అలాంటిదేం జరగలేదు. ఇకపొతే సెప్టెంబర్ 1 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అయిన ఈ మూవీ లో “తేడా సింగ్” అని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాడు. మొత్తానికి ఇండస్ట్రీ లో చాలా మంది అసలు బాలయ్య పూరి జగన్నాధ్ కాంబినేషన్ ఎప్పటికీ సెట్ అవ్వదు అనుకున్నారు .కానీ కట్ చేస్తే ఇప్పుడు వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ సినిమా ఒక్క కట్ కూడా లేకుండా రిలీజ్ కి రెడీ గా ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES