కాకినాడ‌లో మొద‌లైన పొలిటిక‌ల్ కాక‌…. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌తో టీడీపీలో అల‌జ‌డి

117

నంద్యాల నుంచి పొలిటిక‌ల్ వేడి కాకినాడ‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయింది. ఉప ఎన్నిక‌ల వేడి ముగియ‌డంతో ప్ర‌ధాన పార్టీల రాజ‌కీయ నేత‌లు కాకినాడ వెళ్లారు. 48 డివిజ‌న్ల‌లో ప్ర‌చారం ఉధృతంగా సాగుతోంది. వైసీపీ త‌ర‌పున ఈ నెల‌ 26,27న పార్టీ అధినేత జ‌గ‌న్ ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. అయితే జగన్ కు వైరల్ ఫివర్ వల్ల డాక్టర్లు పర్యటనకు వెళ్లవద్దని, ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. అయితే జగన్ కాకినాడ వెళతాడా? లేదా అన్న విషయం ఇంక స్పష్టం కాలేదు. ఇప్పటికే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుతో పాటు ప‌లువురు సీనియ‌ర్లు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న  ఉండడంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు మొద‌లైంది. వెంట‌నే సీఎం చంద్రబాబు ప్ర‌చారం కోసం వెంప‌ర్లాడారు. దీంతో చంద్ర‌బాబు కూడా రెండురోజులు కాకినాడ‌లో ప‌ర్యటించ‌బోతున్నారు.

మ‌రోవైపు గెలుపుపై టీడీపీలో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో చాలా మంది మంత్రులు, అనేక మంది ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలను కాకినాడ‌లో దింపారు.  48 డివిజన్లకు మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్‌ఛార్జులుగా నియమించారు. డివిజ‌న్ల‌వారీగా డ‌బ్బుల పంపిణీకి నేత‌లు స్కెచ్‌లు రెడీ చేస్తున్నారు. మ‌రోవైపు ఫించ‌న్లు, డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌ను త‌మ‌కు ఓటేయ‌క‌పోతే ఇబ్బంది ప‌డ‌తార‌ని బెదిరిస్తున్నారు. నంద్యాల‌ బెదిరింపు, ప్ర‌లోభ‌ప‌ర్వాల‌ను ఇక్క‌డ కూడా కంటిన్యూ చేస్తున్నారు. మొత్తానికి రెండునెల‌లుగా నేత‌ల‌కు ఎన్నిక‌ల ఫీవ‌ర్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

NEWS UPDATES

CINEMA UPDATES