కిడ్నీ ఇన్ఫెక్షన్స్ తో జాగ్రత్త…!

87

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు మూత్రపిండాలు. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో ఏర్పడే మలినాలను ,శరీరంలో జరిగే ఏ జీవక్రియలోనైనా ఏర్పడే వ్యర్థపదార్థాలను ఎప్పటికప్పుడు తొలగించి శరీరాన్ని శుచిగా, శుద్ధిగా ఉంచే సహజసిద్ధ యంత్రాలు కిడ్నీలు. ఇవి పనిచేయమని మొరాయిస్తేఆరోగ్యం అస్తవ్యస్తమవుతుంది. కిడ్నీ వ్యాధులు  బ్యాక్టీరియాతో  సోకే ఇన్ఫెక్షన్స్ కారణంగా వస్తాయి. శరీరంలో ఇతరభాగంలో ఇన్ఫెక్షన్స్ సోకడం, చీము పట్టడం , టిబి, టాన్సిల్స్‌, గ్రంథులకు సోకే ఇన్‌ఫెక్షన్లు మొదలైనవి రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరడం  వల్ల ఇన్ఫెక్షన్స్ సోకుతాయి.పురుషులతో పోలిస్తే మహిళల్లో యూరినరీ ఇన్ఫెక్షన్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువ. సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఒకసారి వస్తే తరచూ తిరగబెడుతుంటాయి. సంతాననిరోధక సాధనంగా డయాఫ్రమ్ వాడే మహిళల్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి.

పురుషుల్లో 50 ఏళ్లు దాటాక మూత్రసంబంధమైన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడం ఒక కారణమైతే, ఆహారంలో మసాలాలు, మద్యం, కాఫీ వంటి వాటివల్ల కూడా మూత్రవిసర్జన సమయంలో మంట వచ్చే అవకాశం ఉంది.అందుకే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందాలంటే క్రాన్ బెర్రీ ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.  అలాగే జునిపర్ బెర్రీస్ను డైట్ లో చేర్చుకోవడం వల్ల కిడ్నీలో వ్యర్థాలుమూత్రం ద్వారా బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. అంతేకాదు మంచి నీరు తాగుతూ పరిశుబ్రమైన ఆహారాన్ని తీసుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

NEWS UPDATES

CINEMA UPDATES