చంద్రబాబుకు సినిమా చూపిస్తున్న అధికారులు

193

ప్ర‌జ‌ల్ని మ‌భ్య‌పెట్టి, మాయ‌చేసే స్వ‌ప్ర‌యోజ‌నం పొందే విష‌యంలో చంద్ర‌బాబును చూసి ఏవరైనా నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. చెప్పింది చెప్ప‌కుండా, ప్ర‌జ‌లకు అనుమానం రాకుండా, వాళ్ల‌ను ఒక‌ర‌క‌మైన బ్రాంతిలోకి నెట్ట‌డం, రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందటం అనేది బాబుకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలీదు. కానీ రోజుల‌న్నీఒకేలా ఉండ‌వు. ప్ర‌జ‌లు ఎపుడూ మోస‌పోరు. ఆవిష‌యం తెలిసేస‌రికి చంద్ర‌బాబు ద‌శాబ్ద‌కాలం పాటు ప్ర‌తిప‌క్షంలో ఉండాల్సి వ‌చ్చింది. ఇపుడూ అదే ప‌రిస్థితులు ఆయ‌న కొనితెచ్చుకుంటున్నాడు. మీస‌మ‌స్య‌లు చెప్పండి ఇట్టే ప‌రిష్క‌రిస్తాం అని ఒక‌ప్పుడు జ‌న్మ‌భూమి  స‌మావేశాలు పెట్టించిన ఘ‌న‌త చంద్ర‌బాబుదే. ఇపుడు టెక్నాల‌జీ వాడుతూ కాల్ సెంట‌ర్లు ప్రారంభించారు. టెక్నాల‌జీ స‌మాచార సేకరణకే గానీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కాదు.

ప్ర‌జ‌ల‌కు స‌మ‌స్య‌లు చెప్పుకొనే అవ‌కాశం వ‌చ్చింది గానీ, వాటిని ప‌రిష్క‌రించే వ్య‌వ‌స్థ ఇంకా రూపొంద‌లేదు. దీనివ‌ల్ల బాబు ఆశించిన ల‌క్ష్యం నెర‌వేర‌డం లేదు. చెప్పిన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక ప్ర‌జ‌లు తీవ్ర అసంతృప్తికి లోన‌వుతున్నారు.ఇది అర్థం చేసుకోక ప్రజ‌ల ఆనంద‌పు, తృప్తి స్థాయిని కొలిచేందుకు ఒక కొత్త  విభాగాన్ని ఏర్పాటు చేశారు బాబు. ఆయ‌న మనసులో కోరుకునేది చెప్పే అధికారులు ఆ విభాగంలో ఉన్నారు. వారు ఇచ్చే గ‌ణాంకాల గార‌డీని బాబు న‌మ్మేస్తున్నారు. 97శాతం ప్ర‌జ‌లు సంతృప్తిగా ఉన్నార‌ని నివేదిక‌లు సిద్దం చేసి ముఖ్య‌మంత్రికి ఇస్తున్నారు. దీన్ని చూసి ముఖ్య‌మంత్రికే దిమ్మ‌తిరిగింది. అయితే మిగ‌తా మూడు శాతం ఎందుకు అసంతృప్తిగా ఉన్నారో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అధికారుల‌పై ఆగ్ర‌హించారు. ఈసారి అధికారుల‌కు దిమ్మ‌తిరిగి బొమ్మ క‌న్పించింది.

NEWS UPDATES

CINEMA UPDATES