చక్రపాణిరెడ్డి రాజీనామా ఆమోదం…. ఆయన కనుసన్నల్లోనే

224

21 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించి చాలాకాలమైనా కనీసం ఆ పిటిషన్లపై విచారణ కూడా జరగడం లేదు. స్పీకర్ కార్యాలయంలో చంద్రబాబు ఆదేశాల మేరకు పనిచేస్తుండడం వల్లే ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాయిగా తిరుగుతున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే చంద్రబాబు తనకు నచ్చని వారి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను శరవేగంగా ఆమోదించారు. టీడీపీ నుంచి ఆయన వైసీపీలో ఇటీవల చేరారు. వైఎస్ జగన్ సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల తరహాలో కాకుండా స్పీకర్ ఫార్మట్‌లోనే రాజీనామా పంపించారు.

చక్రపాణిరెడ్డి నైతిక విలువల పేరుతో రాజీనామా డ్రామా ఆడుతున్నారని టీడీపీ మంత్రులు, నేతలు విమర్శలు చేశారు. అయితే చక్రపాణిరెడ్డి సరైన ఫార్మట్‌లోనే రాజీనామా చేశారు. ఆయన  రాజీనామా ఆమోదించేశారు అసెంబ్లీ కార్యదర్శి. సాధారణంగా ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే స్పీకర్ లేదంటే మండలి చైర్మన్‌ విచారణ జరిపి ఆ తర్వాతే ఆమోదిస్తారు. కానీ చక్రపాణిరెడ్డి విషయంలో మాత్రం అలాంటి తంతు ఏమీ లేకుండానే రాజీనామా ఆమోదించేశారు.  చంద్రబాబు ఆదేశాల మేరకే శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను వెంటనే ఆమోదించినట్టు చెబుతున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసి పది రోజులే అయింది.

NEWS UPDATES

CINEMA UPDATES