జగన్‌ను కలిసేందుకు వెళ్లిన రోశయ్య ముఖ్య అనుచరుడు

338
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మరో కీలక నేత వైసీపీలో చేరుతున్నారు. ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శివరామసుబ్రమణ్యం వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. జగన్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఆయన నంద్యాల బయలుదేరారు. రెండు వందల వాహనాల్లో  అనుచరులతో కలిసి ఆయన నంద్యాల వెళ్లారు. కాంగ్రెస్‌లో ఉన్న శివ రామ సుబ్రమణ్యం…  మాజీముఖ్యమంత్రి రోశయ్యకు అత్యంత సన్నిహితుడు. ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన వారు.  వైసీపీలోచేరుతున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన… టీడీపీ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని జగన్‌ ఇచ్చిన హామీని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. వైసీపీలో చేరడం ద్వారా రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని శివరామసుబ్రమణ్యం చెప్పారు. నంద్యాలలోనూ ప్రచారం చేస్తామన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటు ప్రకటన తర్వాత ఆర్యవైశ్యులంతా జగన్‌ వైపు నిలుస్తున్నారని ఆయన చెప్పారు. శివరామసుబ్రమణ్యంతో పాటు పలువురు కాంగ్రెస్, టీడీపీ నేతలు వైసీపీలో చేరుతున్నారు. 

NEWS UPDATES

CINEMA UPDATES