జగన్‌ తీరుకు నిరసనగా మంత్రి షూ పాలిష్

98

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని మంత్రి జవహర్‌ విమర్శించారు. గరగపర్రు వెళ్లి గ్రామస్తులతో జగన్‌ చర్చలు జరిపిన నేపథ్యంలో స్పందించిన మంత్రి…  మాదిగలను టీడీపీకి దూరం చేసేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ తీరును వ్యతిరేకిస్తూ మంత్రి జవహర్‌ పశ్చిమగోదావరి జిల్లాలో షూ పాలిష్ చేసి నిరసన తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాదిగలకు వ్యతిరేకి అని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి జవహర్‌ మండిపడ్డారు.

NEWS UPDATES

CINEMA UPDATES