టీజ‌ర్ తో అటెన్ష‌న్ తీసుకొచ్చిన‌ శ‌ర్వానంద్‌

180

శ‌ర్వానంద్ హీరోగా,  మెహ‌రిన్ హీరోయిన్ గా తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హ‌నుభావుడు. ఒక్క సాంగ్ మిన‌హా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం టీజ‌ర్ ని విడుద‌ల చేశారు. హీరో శ‌ర్వానంద్ చాలా ఢిఫ‌రెంట్ కేర‌క్ట‌ర్ లో క‌నిపిస్తున్నారు. నా పేరు ఆనంద్ నాకో ఓసిడి వుంది.. ఓసిడి అంటే బిటెక్, ఎమ్ టెక్ లాంటి డిగ్రీలు కాదు డిజార్డ‌ర్‌.. ఈ ల‌క్ష‌ణాలు అతి శుభ్రం, విప‌రీత‌మైన నీట్ నెస్‌.. అంటూ వాయిస్ ఓవ‌ర్ తో స్టార్ట్ చేసారు.. మేకింగ్ ప‌రంగా యు.వి క్రియోష‌న్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదనే విష‌యం టీజ‌ర్ చూసిన ప్ర‌తిఓక్క‌రూ చెప్పే మాట‌..  ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా లాంటి విదేశాల్లో మ‌రియు పోలాచ్చి, రామెజిఫిల్మ్‌సిటి, హైద‌రాబాద్ లో ని అంద‌మైన లోకేష‌న్స్ లో షూటింగ్ జ‌రుపుకుంది.  ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. అన్ని కార్క‌క్ర‌మాలు పూర్త‌చేసి విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా విడుద‌ల చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES