తాతా చిల్…. వీహెచ్ పై విజయ్ దేవరకొండ సెటైర్

283

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా అర్జున్ రెడ్డి చిన్నపాటి వివాదంలో ఇరుక్కుంది. సెన్సార్ తో ఇప్పటికే రగడ పెట్టుకున్న ఈ సినిమా, ఎ-సర్టిఫికేట్ తో రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో పొడవాటి లిప్ కిస్ సీన్ ఒకటి ఉంది. సెన్సార్ అడ్డుచెప్పడంతో ఆ సన్నివేశాన్ని తొలిగించారు. అయినప్పటికీ మూవీకి ఎ-సర్టిఫికేట్ దక్కింది. అది వేరే విషయం.

ఇప్పుడిదే ముద్దు సీన్ వివాదానికి కారణమైంది. సెన్సార్ లో తీసేసినా పోస్టర్ పై మాత్రం దర్శనమిస్తోంది ముద్దు సీన్. ఆ సీన్ తో ఎక్కడపడితే అక్కడ పోస్టర్లు వెలిశాయి. దీనిపై కాంగ్రెస్ నేత వీహెచ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. పోస్టర్ల నిండా ఆ లిప్ కిస్సులేంటని కోపం వ్యక్తంచేసిన వీహెచ్.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. కొన్ని సిటీబస్సులను ఆపి, వాటిపై అర్జున్ రెడ్డి పోస్టర్లను కూడా పీకేశారు.

ఈ మొత్తం వివాదం అర్జున్ రెడ్డికి ఫుల్ పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. అయితే ఇక్కడితో ఆగకుండా ఈ వివాదాన్ని మరింత కెలికాడు హీరో విజయ్ దేవరకొండ. సిటీ బస్సుపై అర్జున్ రెడ్డి పోస్టర్ ను చించేస్తున్న వీహెచ్ ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, దాని కింద తాతా ఛిల్ (తాత కాస్త చల్లారు) అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో కాంగ్రెస్ లో ఓ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది.

https://twitter.com/VjDevarakonda/status/899502807023198209

NEWS UPDATES

CINEMA UPDATES