తాప్సీ ఎలా రెచ్చిపోయిందంటే….

187

పంజాబీ భామ తాప్సీ ఏదో ఒక వివాదంతో ఎప్పుడూ వార్త‌ల్లో ఉంటుంది. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావుపై కామెంట్స్‌తో ఆమె కొంత‌కాలం కింద‌ట వివాదాల్లోకి వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆ వ్యాఖ్య‌ల‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పింది.  తాప్సీ న‌టించిన ఆనందో బ్ర‌హ్మ ఇటీవ‌ల విడుద‌లైంది. మంచి మార్కులే కొట్టింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట‌ర్ అయింది. అయితే అప్పుడు చేసిన కామెంట్స్ కొంచెం పార్టిసిపెంట్స్‌ను నొప్పించాయి.

అయితే ఇప్పుడు  వరుణ్ ధావన్- జాక్విలైన్, తాప్సీ కాంబినేషన్‌లో రానున్న ఫిల్మ్ “జుడ్వా2”. నిన్న‌నే ట్రైల‌ర్ విడుద‌లైంది. తెలుగులో హ‌లో బ్ర‌ద‌ర్‌కి పార్ట్‌2 ఈ సినిమా. హిందీలో తొలి పార్ట్‌లో స‌ల్మాన్ ఖాన్ న‌టించారు. ఇప్పుడు ఈ సినిమాలో  శ్రీలంక బ్యూటీ జాక్విలైన్, తాప్సీ‌లు రెచ్చిపోయి నటించారు.  ముద్దులే కాదు, బికీనీల్లో ఇద్ద‌రు భామ‌లు ఒక లెవ‌ల్లో ఎక్స్‌పోజింగ్ ఇచ్చారు. 1997లో స‌ల్మాన్‌ఖాన్-క‌రీష్మా క‌పూర్- రంభ కాంబోలో వచ్చిన ‘జుడ్వా’కి ఇది సీక్వెల్. ఇందులో వరుణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. సాజిద్ న‌దియావాలా దీనికి ప్రొడ్యూసర్ కాగా, ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 29 న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

NEWS UPDATES

CINEMA UPDATES