తెలంగాణ పర్యటనకు వైఎస్‌ జగన్

175
ఎన్నికల తర్వాత తెలంగాణలో వైసీపీ కార్యక్రమాలు దాదాపు  లేవనే చెప్పాలి. తెలంగాణ పార్టీ అధ్యక్షుడే అక్కడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. వైఎస్‌ జగన్‌ గానీ సీనియర్ నేతలు గానీ తెలంగాణ వైసీపీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.  అయితే ఇప్పుడు తెలంగాణ పర్యటనకు వైఎస్‌ జగన్ సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా జగనే చెప్పారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్నజగన్‌కు  తెలంగాణ వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. పెబ్బేరు వైసీపీ నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన జగన్… ఉప ఎన్నికల తర్వాత తెలంగాణలో పర్యటిస్తానని చెప్పారు.  తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES