నంద్యాలలో భయానక దృశ్యాలు…. దిగ్బ్రాంతికి గురిచేస్తున్న వేటకొడవళ్ల దృశ్యాలు

125

ఏపీలో శాంతిభద్రతలను ప్రశ్నించే ఘటన నంద్యాలలో జరిగింది. అందరూ చూస్తుండగానే టీడీపీ నేత అభిరుచి మధు… స్వైరవిహారం చేశాడు. శిల్పా చక్రపాణిరెడ్డి టార్గెట్‌గా ఐదు రౌండ్లు కాల్పులు జరగడంతోపాటు… వేటకొడవలితో రెచ్చిపోయారు. నడిరోడ్డుపై మీసాలు మేలేస్తూ, వేటకొడవలి చూపిస్తూ రారా నరికేస్తా అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. అభిరుచి మధు వేటకొడవలి పట్టుకుని సవాల్ చేస్తున్న సమయంలో ఆయనకు అటు ఇటుగా దాదాపు పది మంది పోలీసులు ఉన్నారు. కానీ అడ్డు చెప్పలేకపోయారు.

అభిరుచి మధు సృష్టించిన భయానక వాతావరణాన్ని కొందరు సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు.  ఈ దృశ్యాలను చూసి సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోఉన్న సమయంలో తుపాకులు వెనక్కు ఇవ్వాల్సి ఉంటుంది. అందులోనూ రౌడీ షీటర్ అయిన అభిరుచి మధు తుపాకీని పోలీసులు ఎందుకు వెనక్కు తీసుకోవడంలేదన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. భూమా నాగిరెడ్డికి అనుచరుడు కావడం వల్లే అభిరుచి మధుకు ప్రత్యేకంగా గన్‌మెన్లను కూడా కేటాయించినట్టు చెబుతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES