నంద్యాల ప్రజలకు తుందుర్రు బాధితుల ర్యాలీ సందేశం

108

నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతేనే చంద్రబాబు నేల మీదకు వస్తారన్న అభిప్రాయాన్ని తుందుర్రు ఆక్వాపార్క్ బాధితులు ఆశిస్తున్నారు. నంద్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ తుందుర్రు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని కోరారు. ఓటేసిన ప్రజలకే కాటేసిన చంద్రబాబును నంద్యాలలో ఓడించండి అంటూ బ్యానర్లతో ర్యాలీ నిర్వహించారు. టీడీపీకి ఓటేసి తమలా మోసపోవద్దని కోరారు.

తుందుర్రు, జొన్నల గురువు కె. బేతపూడి గ్రామాల ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తుందుర్రులో ప్రారంభమైన ర్యాలీ జొన్నలగరువు మీదుగా కంసాల బేతపూడిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌  విగ్రహం వద్దకు చేరుకుంది. అధికారమొచ్చాక మోసం చేయడం చంద్రబాబు నైజమని బాధితులు విమర్శించారు. మూడేళ్లుగా ఇక్కడ ఫుడ్‌పార్కు వద్దని తాము పోరాటం చేస్తుండగా… సీఎం చంద్రబాబు మమ్మల్ని ఆహ్వానించి మీకు అన్యాయం చేయబోనని భరోసా ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ తుందుర్రులో ఫ్యాక్టరీ కడుతున్నారని మండిపడ్డారు.

NEWS UPDATES

CINEMA UPDATES