నిర్మాతగా మారబోతున్న హరీష్ శంకర్

95
మరో నిర్మాతకు సినిమా చేసి పెట్టడానికి ఇబ్బంది ఫీల్ అవుతున్నాడట. తన మనసులో ఉన్నది ఉన్నట్టుగా తెరపై చూపించలేకపోతున్నాడట. అందుకే తనే నిర్మాతగా మారాలని డిసైడ్ అయ్యాడు హరీష్ శంకర్. ఇకపై తనే నిర్మాతగా ఓ బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తానంటున్నాడు. అయితే నిర్మాణంతో పాటు దర్శకత్వం బాధ్యతల్ని మాత్రం స్వీకరించనని అంటున్నాడు.
ఓ మంచి కాన్సెప్ట్ తో ఎవరైనా వస్తే, వాళ్లను దర్శకుడిగా మార్చి తను నిర్మాతగా మంచి సినిమాలు తీస్తానంటున్నాడు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు మాత్రం చేయనని, లో-బడ్జెట్ లోనే మంచి క్వాలిటీతో సినిమాలు చేస్తానంటున్నాడు. చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలకు దృశ్యరూపం ఇవ్వడమంటే తనకు చాలా ఇష్టమని.. వీటితో పాటు టీవీలో చూసిన మాల్గుడి డేస్ వంటి సీరియళ్లను సినిమాలుగా తీయాలని తనకు ఉందని చెప్పుకొచ్చాడు.
అయితే చందమామ కథలు, మాల్గుడి డేస్ ను సినిమాలుగా తీస్తే ఇప్పుడెవరూ చూడరు కాబట్టి.. ఆనంద్, గోదావరి, పెళ్లి చూపులు, ఉయ్యాల జంపాల లాంటి మంచి కాన్సెప్ట్స్ తో ఎవరైనా వస్తే సినిమాలు నిర్మిస్తానంటున్నాడు ఈ డీజే డైరక్టర్.

NEWS UPDATES

CINEMA UPDATES