పవన్ కళ్యాణ్ ఫాన్స్ వైలెంట్ అంటున్న మహేష్ కత్తి

849

సినిమా క్రిటిక్ గా ఇండస్ట్రీ లో ఉన్న  మహేష్ కత్తి ‘బిగ్ బాస్’ షోలో పాల్గొన్న  తరువాత ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిపోయాడు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ షో నుండి వెళ్ళిపోయిన మహేష్ కత్తి రీసెంట్ గా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించాడు. ‘జనసేన’ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహార శైలిపై సంచలన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ కేవలం ట్వీట్స్ కే పరిమితం అవుతున్నాడు అని  కామెంట్ చేసాడు . అలాగే ప్రస్తుతం పవన్ ప్రశ్నించడం తప్పించి అంతకు మించి ఏమి చెయ్యట్లేదు అని మహేష్ కత్తి అన్నాడు.

ఒకవేళ ప్రశ్నిస్తేనే ముఖ్య మంత్రిని చేస్తారు అనుకుంటే నేను కూడా ప్రశ్నిస్తాను నన్ను కూడా సిఎంని చేసేయండి అని పవన్ పై జోక్స్  వేశాడు కత్తి. ఈ కామెంట్స్ విన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్  మహేష్ కత్తి పై సోషల్ మీడియా లో చిన్న పాటి యుద్దమే ప్రకటించారు. మహేష్ కి కాల్ చేసి బెదిరించి ఆ వాఖ్యలు వెనక్కి తీసుకోవాలని లేదంటే పరిమాణాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని అంటున్నారట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అసలు పవన్ కళ్యాణ్ ఫాన్స్ మరీ ఇంత వైలేంట్ గా తయారు అవుతారు అని తాను ఎప్పుడూ అనుకోలేదు అని  మహేష్ కత్తి తన సోషల్ మీడియా లో చెప్పుకోచ్చారు.

NEWS UPDATES

CINEMA UPDATES