పీకే వ్యూహం ఫ‌లిస్తుందా?

802

ఇప్పుడు దేశం మొత్తం పీకే పాలిటిక్స్ న‌డుస్తున్నాయి… 2014 ఎన్నిక‌ల్లో మోదీ క‌నీవినీ ఎరుగ‌ని విజ‌యం సాధించ‌డం వెన‌క పీకే పాలిటిక్సే ఉన్నాయి. పీకే అలియాస్ ప్ర‌శాంత్ కిషోర్‌. ఈ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త  న‌రేంద్ర‌ మోదీకి దేశం యావ‌త్తూ న‌మో న‌మామి అనేలా చేశాడు. మోదీకి సునామీ విజ‌యం అందించాడు. చాయ్ పే చ‌ర్చ అంటూ స్కెచ్ గీసి ప్ర‌ధాని ప‌ద‌విని ప‌ళ్లెంలో పెట్టి అందించాడు… బీహార్‌లో నితీష్‌కుమార్‌ని ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎంని చేసిన ఘ‌న‌త కూడా పీకేదే….ప్ర‌శాంత్ కిషోర్ ఏ పార్టీ త‌ర‌ఫున రంగంలోకి దిగుతాడో అప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు అశాంతి మొద‌ల‌వుతుంది… ఆయ‌న వ్యూహాల‌ను అర్థం చేసుకునే లోప‌లే వాళ్ల ప‌ని అయిపోతుంది…. ఇప్పుడు ఏపీలో ఆయ‌న బీపీ పెంచుతున్నాడు… జ‌గ‌న్ పార్టీ జెండాకు అజెండాగా మారిన పీకేని చూసి టీడీపీ ప‌రేషాన్ అయిపోతోంది…అయితే పీకే ఏం పీకుతాడో చూస్తాం అంటూ టీడీపీ మేక‌పోతు గాంభీర్యం ప్ర‌క‌టిస్తున్నా… పీక‌డం ఆల్రెడీ మొద‌లైపోయింద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి…

నంద్యాల నాందిగా పీకే పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయ‌ని, జ‌గ‌న్ చాలా అగ్రెస్సివ్‌గా మాట్లాడ‌డం, దూకుడు పెంచ‌డం, చాలా రోజులు ప్ర‌చారం చేయ‌డం, న‌వ‌ర‌త్నాల‌ను ప్ర‌క‌టించ‌డం.. త‌ద్వారా టీడీపీలో అశాంతిని పెంచ‌డం వెన‌క ప్ర‌శాంత్ వ్యూహం ఉంద‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల స‌మాచారం.  నంద్యాల‌లో టీడీపీకి ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ద్వారా పీకే తొలి పంచ్ కొట్ట‌నున్నారని చెబుతున్నారు.  పీకే వ్యూహాలు ఫ‌లిస్తున్నాయ‌ని ఆయ‌న ఎత్తుల ముందు చంద్ర‌బాబు చిత్త‌వుతున్నార‌ని నంద్యాల వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే పీకే పాలిటిక్స్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సైకిల్ సైన్యం భ‌విష్య‌త్తులో ఆయ‌న‌ను ఎలా ఎదుర్కోవాలా అని బెంబేలెత్తిపోతోంద‌ని రాజ‌కీయ మేధావులు విశ్లేషిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES