పెళ్లి త‌ర్వాత చైతూ, సామ్ సినిమా

253

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సమంతా పెళ్లికి ఏర్పాటు ఊపుందుకున్నాయి. రెండు కుటుంబాలు షాపింగ్‌లో మునిగి తేలుతున్నాయి.అక్టోబ‌ర్ 6న చైతూ, స‌మంతా పెళ్లి గోవాలో జ‌ర‌గబోతుంది. దీంతో సెప్టెంబ‌ర్‌లోపు త‌మ సినిమా కార్య‌క్ర‌మాలు ముగించాల‌ని ఇద్ద‌రూ ప్లాన్ చేశారు. త‌ము ఒప్పుకున్న సినిమాల‌ను పూర్తి చేసేందుకు చ‌క‌చ‌కా షూటింగ్ చేస్తున్నారు. చైతూ యుద్ధం శ‌ర‌ణం సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు చైతూ. ఇటు స‌మంతా త‌మిళంలో విజ‌య్‌తో చేసిన సినిమా పూర్తి అయింది. ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైంది.

తెలుగులో రాజుగారి గది షూటింగ్ ఒక‌రోజు మిగిలింది. ఈ సినిమా పూర్త‌యితే రంగ‌స్థ‌లం ఒక‌టే మిగిలి ఉంటుంది. ఈసినిమా నెల‌రోజులు స‌మంతా సెల‌వు ప్ర‌క‌టించార‌ట‌. అయితే టీటౌన్‌లో ఇప్పుడు ఓవార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య‌, స‌మంతా క‌లిసి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని తెలిసింది. ద‌ర్శ‌కుడు మారుతి ఇప్ప‌టికే వీరిద్ద‌రికి ఓ లైన్ చెప్పాడ‌ట‌. స్టోరీడెవ‌ల‌ఫ్ చేయ‌మ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. అన్నీ కుదిరితే న‌వంబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మారుతి ప్ర‌స్తుతం మ‌హానుభావుడు సినిమా బీజీలో ఉన్నాడు. ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత కొత్త సినిమా ప్రాజెక్టు చేప‌ట్ట‌బోతున్నాడ‌ని తెలిసింది. స‌మంతా,చైతూ క‌లిసి ఇప్ప‌టివ‌ర‌కూ మూడు సినిమాల్లో న‌టించారు. ఏమాయ చేశావె, ఆటోన‌గ‌ర్ సూర్య‌, మ‌నంలో క‌లిసి జంట‌గా క‌నిపించారు.

NEWS UPDATES

CINEMA UPDATES