ప్రభాస్ కోసం కొత్త ముద్దుగుమ్మలు

109

రకుల్ ప్రీత్ సింగ్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్, అనుపమ పరమశ్వరన్, మెహ్రీన్, లావణ్య త్రిపాఠి… ఇలా టాలీవుడ్ ఎంతోమంది కొత్త భామలతో కళకళలాడుతోంది. వీళ్లలో రకుల్ ప్రీత్ సింగ్, లావణ్య మినహాయిస్తే.. మిగతావాళ్లంతా ఇంకా జూనియర్లే. వీళ్లలో కనీసం ఒక్కరితో కూడా స్క్రీన్ షేర్ చేసుకోలేదు ప్రభాస్. కావాలనుకుంటే తన నెక్ట్స్ సినిమా కోసం వీళ్లలో ఒకర్ని సెలక్ట్ చేసుకోవచ్చు. ఏ ఒక్కర్ని సంప్రదించినా కాల్షీట్లు కేటాయించడానికి రెడీ. కానీ ప్రభాస్ మాత్రం అలా చేయడం లేదు. కొత్త గుమ్మల కోసం వెయిటింగ్.

సుజీత్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. దాదాపు 150కోట్ల రూపాయల బడ్జెట్ తో సెట్స్ పైకి రాబోతున్న ఈ భారీ బడ్దెట్ సినిమా కోసం ప్రస్తుతం లొకేషన్లతో పాటు హీరోయిన్లను వెదికే పనిలో పడ్డారు. కథ ప్రకారం, కొత్తమ్మాయిల్ని తీసుకుంటే బెటరని సుజీత్ భావిస్తున్నాడట. అందుకే త్వరలోనే ఆడిషన్స్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. సో.. ప్రభాస్ సరసన నటించాలని కలలుకంటున్న ఈ భామలెవరికీ ప్రస్తుతానికి ఆ అవకాశం దక్కనట్టే. ప్రభాస్-సుజీత్ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలకు చోటుందట. ఈ ఇద్దర్లో కనీసం ఒక్కర్నైనా ఇప్పుడున్న భామల నుంచి సెలక్ట్ చేసుకుంటే బాగుండేదని చాలామంది భావిస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES