ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి… ఎనిమిదిరెట్లు ఎక్కువ‌గా ఖ‌ర్చుపెడుతున్నాం!

68

మ‌న‌దేశంలో ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి  ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఖ‌ర్చుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. జాతీయ ఆరోగ్య గ‌ణాంకాల ప్ర‌కారం2013-14 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను భార‌తీయులు ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో కంటే ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యం కోసం ఎనిమ‌ది రెట్లు ఎక్కువ‌గాఖ‌ర్చు చేశారు. అలాగే పేషంట్లను త‌ర‌లించ‌డానికి రెండురెట్లు ఎక్కువ‌గా ర‌వాణా ఖ‌ర్చులు చేశారు. దాదాపు ద‌శాబ్దం త‌రువాత ఈ వివ‌రాల‌నుఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. భార‌త కుటుంబాలు ప్ర‌యివేటు ఆసుప‌త్రుల్లో వైద్యానికి రూ. 64, 628 కోట్లు వెచ్చిస్తే…అదే గ‌వ‌ర్న‌మెంటుఆసుప‌త్రుల్లో వైద్య ఖ‌ర్చుల కోసం కేవ‌లం రూ.8,193 కోట్లు ఖ‌ర్చు చేశాయి. ఇక అంబులెన్స్‌లాంటి  పేషంట్ల ప్ర‌యాణ ఖ‌ర్చుల‌కు మొత్తం18,149కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేశారు. 2013-14 సంవ‌త్స‌రానికి భార‌త్…. మొత్తం స్థూల జాతీయ ఉత్ప‌త్తిలో నాలుగుశాతాన్ని అంటే 4.5ల‌క్ష‌ల కోట్లు ఆరోగ్య ర‌క్ష‌ణకోసం  ఖ‌ర్చుచేసింది. ఇందులో కుటుంబాలు చెల్లించిన మొత్తం 3.06ల‌క్ష‌ల కోట్లుగా ఉంది. ప్ర‌భుత్వం ప్ర‌జారోగ్య ర‌క్ష‌ణవిష‌యంలో చేస్తున్న వ్యయం గ‌తంతో పోలిస్తే ప్ర‌స్తుతం పెరిగింది. అయితే అనారోగ్యాలు రాకుండా ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల కోసం ప్ర‌భుత్వం చేస్తున్నఖ‌ర్చు మాత్రం…. మొత్తం ఆరోగ్య ర‌క్ష‌ణ వ్యయంలో 9.6శాతం మాత్ర‌మే ఉంది.

NEWS UPDATES

CINEMA UPDATES