ఫిక్స్ అయిన పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ మూవీ టైటిల్

251

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా అంటే పవన్ అభిమానులే కాదు తెలుగు మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తారు. అలాంటి వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా మొదలై చాలా రోజులు అవుతుంది. వీల్లిదరి కాంబినేషన్స్ లో  వచ్చిన గత రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ మూడో సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా  ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ  సోషల్ మీడియాలో పలు పేర్లు సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఫైనల్ గా ఈ మూవీ కి  “రాజు వచ్చినాడు” అనే టైటిల్ ని ఖారారు చేసారట మూవీ యూనిట్.

స్టార్ హీరోలకు సైతం కొత్త తరహా టైటిల్స్ పెట్టగల త్రివిక్రమ్ ఈ మూవీ కి కరెక్ట్ టైటిల్ ని ఎంచుకున్నాడు అని ఫిలిం నగర్ ప్రజలు త్రివిక్రమ్ ని తెగ పొగిడేస్తున్నారు. దాదాపు ఈ టైటిల్ ఖరారయినట్లే అని బయట టాక్ వినిపిస్తుంది. అయితే మూవీ యూనిట్ మాత్రం సెప్టెంబర్ 2న అంటే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా ఈ మూవీ యొక్క టైటిల్ ని ఇంకా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాని అనుకుంటున్నారట.

 

NEWS UPDATES

CINEMA UPDATES