బరువు తగ్గే పనిలో రాశి ఖన్నా

196

సౌత్ హీరోయిన్లలో బబ్లీ లుక్ లో కనిపించే రాశిఖన్నా ఊహలు గుసగుసలాడే వంటి లవ్ స్టొరీతో తెలుగు ఇండస్ట్రీ కి  ఎంట్రీ ఇచ్చి యూత్ అందరినీ ఆకట్టుకుంది. అందరు హీరోయిన్లలా అందాల ఆరబోతకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా తన క్యూట్ నెస్ తో అలరించింది రాశి ఖన్నా. అయితే ఇప్పుడు  గ్లామరస్ పాత్రలకి ఓకే చెప్పి స్టార్ హీరోలతో సినిమాలు కూడా  చేసింది. అయితే రాశి ఖన్నా సడన్ గా సినిమాలు లేక బరువు పెరిగింది. కానీ, ఇటీవల రాశి కి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు అవకాశాల కోసం బరువు తగ్గేందుకు చాలా శ్రమిస్తుంది ఈ ముద్దుగుమ్మ. జిమ్ లో వ్యాయామాలు చేసి చేసి జీరో సైజుకి వచ్చిందని రాశి ఖన్నా సన్నిహితులు చెపుతున్నారు.

అయితే రాశి ఖన్నా ఇకనుంచి సరికొత్త అందాలతో ఆడియన్స్ ని అలరించనుంది అన్నమాట. ఈమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ తో “జై లవకుశ”, రవితేజ తో “టచ్ చేసి చూడు”, వరుణ్ తేజ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది రాశి ఖన్నా. వీటితో పాటు తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఒకే చేసిందంట రాశి ఖన్నా. బరువు తగ్గితే  గాని అవకాశాలు రావు అని గ్రహించిన రాశి ఖన్నా స్టార్ హీరోస్ తో అవకాశాల పట్టే వేట లో ఉంది. రాశి నటించిన “జై లవ కుశ” సెప్టెంబర్ 21 న రిలీజ్ కి రెడీ అవుతుంది.

NEWS UPDATES

CINEMA UPDATES