బాలయ్య కి నో చెప్పిన బిగ్ బీ, చిరు కి ఎందుకు ఎస్  చెప్పాడు ?

132

ఇండియన్ సినిమా కి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయిన బిగ్ బీ ఫస్ట్ టైం తెలుగు లో ఒక ఫుల్ లెంగ్త్ రోల్ చేయనున్నాడు. అది కూడా చిరంజీవి 151 వ సినిమాలో. అయితే బిగ్ బీ కి ఇంతకు ముందు బాలకృష్ణ తో “రైతు” అనే చిత్రం లో నటించమని పిలుపు వచ్చింది. కానీ ఆ మూవీ లో తన రోల్ నచ్చక ఆ మూవీ కి ఒకే చెప్పలేదు బిగ్ బీ. తరువాత కొన్ని కారణాల వల్ల అసలు ఆ మూవీ స్టార్ట్ కాలేదు.

కానీ బాలయ్యకి నో చెప్పిన అమితాబ్, చిరంజీవికి ఎందుకు ఎస్ చెప్పాడు అంటే. ఇంతకుముందు “బుడ్డా హోగా తేరా బాప్” ప్రమోషన్స్ కి హైదరబాద్ కి వచ్చిన బిగ్ బీ చిరంజీవితో 150 వ చిత్రం లో నటిస్తాను అని చెప్పాడు. కానీ 150 లో ఛాన్స్ మిస్ చేసుకున్న బిగ్ బీ చిరంజీవి 151 లో నటించడానికి ఒప్పుకున్నాడు. ఇది కేవలం చిరంజీవితో ఉన్న ఫ్రెండ్ షిప్ కోసం ఒప్పుకోలేదట పాత్ర నచ్చే అమితాబ్ ఈ మూవీ చేయడానికి అంగీకరించాడు అని ఫిలిం నగర్ టాక్. అయితే ఈ మూవీ లో నరసింహ రెడ్డి కి గురువు పాత్ర లో అమితాబ్ కనిపిస్తారు. మూవీ సెకండ్ హాఫ్ లో ఈ గురువు పాత్ర కి చాలా స్కోప్ ఉంటుంది అని టాలీవుడ్ వర్గాల సమాచారం.

NEWS UPDATES

CINEMA UPDATES