బాలయ్య బాబు ప్రమోషన్ అదిరింది

97

బాలయ్య  తన 101 వ చిత్రంగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో చేస్తున్న మూవీ పైసా వసూల్. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ని చాలా డిఫరెంట్ గా ప్రమోట్ చేస్తున్నారు టీం. మేటర్ లోకి వెళ్తే హైదరాబాద్ లో దోశ ప్లేస్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్ వాళ్ళు వాళ్ళ హోటల్ లో 101 అనే దోశ ని తయారు చేసారు. అలాగే ఈ దోశ కి వారు “పైసా వసూల్” అనే పేరు కూడా పెట్టారు. దాంతో పాటు ఇది తేడా దోశ అని ఒక కాప్షన్ కూడా పెట్టి కస్టమర్స్ ని ఆకట్టుకుంటున్నారు.

అయితే ఈ మూవీ లో బాలయ్య   “తేడా సింగ్” అనే క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. అందుకే ఆ హోటల్ వాళ్ళు కూడా ఆ దోశ కింద “ఇది తేడా దోశ” అని కాప్షన్ పెట్టారు. తెలుగు సినిమా లో ఒక మూవీ కి ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రచారం ఎప్పుడూ చేయలేదని విమర్శకులు పొగుడుతున్నారు. ఇక మూవీ విషయానికి వస్తే ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని మాస్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. అలాగే ఈ మూవీ లో బాలయ్య ఒక మంచి మాస్ సాంగ్ ను కూడా పాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

NEWS UPDATES

CINEMA UPDATES