బాలయ్య సినిమా సెన్సార్ పూర్తి

218

బాలకృష్ణ-పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం పైసా వసూల్. ఈ సినిమా అనుకున్న టైమ్ కంటే కాస్త ముందే రెడీ అయింది. అందుకే అనుకున్న టైమ్ కంటే కాస్త ముందే విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 1న పైసా వసూల్ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈరోజు ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సినిమాను ఆసాంతం చూసిన సెన్సార్ సభ్యులు మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు.

పైసా వసూల్ సినిమాలో బాలయ్య చూపించిన ఓ మేనరిజమ్ పై చాలా అభ్యంతరాలు వచ్చాయి. సెన్సార్ లో అది కట్ అవ్వొచ్చని చాలామంది అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కొన్ని డైలాగ్స్, మరికొన్ని సన్నివేశాలు ఉంచుతూనే.. మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చారు.

సినిమాలో బాలయ్య సరసన ముస్కాన్, కైరా దత్, శ్రియ హీరోయిన్లుగా నటించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన పైసా వసూల్ సినిమా.. బాలయ్యకు 101వ చిత్రం.

NEWS UPDATES

CINEMA UPDATES