భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ పై  ఐఎంఎఫ్ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు

72

భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ అదుపు త‌ప్ప‌లేద‌ని స‌రైన గాడిలోనే ఉంద‌ని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టీన్‌ ల‌గార్డే అన్నారు. మోడీ ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న త‌రుణంలో ఆమె వ్యాఖ్య‌లు చాలా కీల‌కంగా మారాయి.

నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి సంస్క‌ర‌ణ‌ల ప‌ట్ల బిజెపి సీనియ‌ర్ నాయ‌కులైన య‌శ్వంత్ సిన్హా, అరుణ్‌జైట్లీ వంటి వారు ఇటీవ‌ల కాలంలో తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. ఈ రెండు చ‌ర్య‌ల‌ను మోడీ ప్ర‌భుత్వం వైఫ‌ల్యం కింద భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ గురించి చేసిన వ్యాఖ్య‌లు మోడీ ప్ర‌భుత్వానికి టానిక్‌లా ప‌నిచేయ‌నున్నాయి.

 

నోట్ల ర‌ద్దు, జీఎస్టీ కార‌ణంగా భార‌త వృద్ధిరేట్లు కొంత త‌గ్గింద‌ని గ‌త వారం ప్ర‌క‌టించిన ఐఎంఎఫ్‌…భ‌విష్య‌త్తులో భార‌త్ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆశాభావం వ్య‌క్త ప‌రిచింది.

 

జీఎస్టీ కార‌ణంగా దేశంలో వ్య‌వ‌స్థాగ‌త మార్పులు చోటు చేసుకున్నాయ‌ని అందుకే వృద్ధిరేట్లు త‌క్కువుగా న‌మోద‌యింద‌ని ఆమె తెలిపారు.

NEWS UPDATES

CINEMA UPDATES