మందారంలో…ర‌క్త‌పోటుకి మందు!

98

ఇది నిజంగా మంచివార్తే. మ‌న‌కి బాగా అందుబాటులోఉండేవాటిలో ఔష‌ధ గుణాలు ఉంటే మంచిదే క‌దా. ఇప్ప‌టివ‌ర‌కుమందార‌పూలు, ఆకుల్లో కురుల‌కు మేలు చేసే ఔష‌ధ గుణాలుఉన్నాయ‌నే మ‌న‌కు తెలుసు. కానీ మందార పూల‌ల్లో అధికర‌క్త‌పోటుని త‌గ్గించే అద్భుత గుణాలు ఉన్నాయ‌ని శాస్త్ర‌వేత్త‌లుతేల్చారు. మందార పూల‌తో త‌యార‌యిన టీని సేవిస్తే అధికర‌క్త‌పోటు త‌గ్గుతుంద‌ని, అంతేకాకుండా దీంతో తొలిద‌శ‌లో ఉన్న‌  హైప‌ర్ టెన్ష‌న్‌ని పూర్తిగా త‌గ్గించ‌వ‌చ్చ‌ని క‌నుగొన్నారు.

అమెరికాలోని హ్యూమ‌న్ న్యూట్రిష‌న్ రీసెర్చి సెంట‌ర్ వారు ఈప‌రిశోధ‌న‌ను నిర్వ‌హించారు. 30 నుండి 70ఏళ్ల మ‌ధ్యవ‌య‌సున్న‌వారిని రెండు బృందాలుగా విడ‌గొట్టి, అందులో ఒకబృందానికి ఆరువారాల‌పాటు రోజుకి మూడు క‌ప్పుల చొప్పునమందార‌పు టీని ఇచ్చారు. మ‌రొక బృందానికి మందార‌పు ర‌సంపేరుతోనే కృత్రిమ ద్ర‌వాన్ని ఇచ్చారు. మందార‌పు టీని తీసుకున్న వారిలో సాధార‌ణ ర‌క్త‌పోటుతో పాటు, అధిక ర‌క్త‌పోటు కూడా త‌గ్గ‌టంగ‌మ‌నించారు. అధిక ర‌క్త‌పోటుకి ఇది విశేషంగా ప‌నిచేయ‌టం గుర్తించారు. మందార పూల‌లోని ఈ ఔష‌ధ గుణాల ప‌రిశోధ‌న పూర్తిగా ఒక కొలిక్కివ‌స్తే…త్వ‌ర‌లో మ‌న‌కు మందార పూల టీపొడులు అందుబాటులోకి రావ‌చ్చ‌న్న‌మాట‌.

NEWS UPDATES

CINEMA UPDATES