మనిషి గొప్పదనానికి కొలబద్ధ

147

ఒకసారి శాక్య రాకుమారులు సంఘంలో చేరడానికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ మంగలి ఉపాలి కూడా ఉన్నాడు. బుద్ధుడు ముందుగా ఉపాలికి ధమ్మదీక్షనిచ్చాడు. తర్వాత శాక్య రాకుమారులకిచ్చాడు. దాంతో ఉపాలి బౌద్ధ సంఘంలో శాక్య రాకుమారులకన్నా పెద్దవాడు, వందనీయుడు అయ్యాడు. అక్కడి నియమం ప్రకారం ముందు సంఘంలో చేరిన వాళ్ళకు మిగిలినవాళ్ళంతా నమస్కరించాలి. కాబట్టి రాకుమారుల్లో గర్వం నశిస్తుంది, సోదరభావం, సమతా దృష్టి నెలకొంటాయి అనే

ఉద్దేశంతో ఉపాలికి ముందుగా దీక్షనిచ్చాడు బుద్ధుడు.

మంగలి కులస్తుడైన ఉపాలినే కాదు, వీధులు ఊడ్చే సునీతునికి, అస్పృశ్యులైన శ్వపాక, సుప్రియులకు చండాలుడైన సోపకుడులాంటి వాళ్ళకు కూడా బుద్ధుడు సంఘంలో గౌరవప్రదమైన స్థానం కల్పించాడు. ఉన్నత వ్యక్తిత్వాన్ని, జ్ఞానాన్ని మనిషి గొప్పదనానికి కొలబద్ధలుగా స్వీకరించాడు బుద్ధుడు. సదాచార సంపన్నుడు, జ్ఞాని అయినవాడు ఏ జాతివాడైనా, ఏ వర్గంవాడైనా అతన్ని శ్రేష్ఠుడుగా భావించేవాడు.

బుద్ధుడు ఇతరులతో సంభాషించేటప్పుడు పవిత్ర వాతావరణం, ఆరాధనా భావం ఆ పరిసరాలంతా వ్యాపించేవి.

NEWS UPDATES

CINEMA UPDATES