మన ఊర్లూ పక్క పక్కనే…. చాలా గర్వంగా ఉంది

152

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కే గర్వకారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యకు స్వాగత చర్చలో రాజ్యసభ వేదికగా ప్రసంగించిన విజయసాయిరెడ్డి… వెంకయ్యనాయుడు స్పూర్తితోనే తాను తొలిసారిగా హిందీలో మాట్లాడుతున్నానని చెప్పారు. అనంతరం ఇంగ్లీష్‌లో వైసీపీ ఎంపీ మాట్లాడారు. మీరు నేను ఒకే రాష్ట్రానికి, ఒకే జిల్లాకు, ఒకే నియోజకవర్గానికి చెందిన వారిమవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తమ గ్రామాలు కూడా పక్క పక్కనే ఉంటాయని.. అందుకు గర్వంగా ఉందన్నారు.

వెంకయ్యనాయుడి ప్రసంగాలు అత్యంత స్పూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఒకప్పుడు వెంకయ్యనాయుడిని అసెంబ్లీ టైగర్ అని పిలిచేవారన్నారు విజయసాయిరెడ్డి. ఉప రాష్ట్రపతిగా దేశానికి  గొప్ప నాయకత్వాన్ని వెంకయ్యనాయుడు అందిస్తారని తాను ఆశిస్తున్నానన్నారు. తాను, తన పార్టీ తరపున, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ తరపున… మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని విజయసాయిరెడ్డి రాజ్యసభలో అన్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES