మహిళలపై ఏవీ ప్రతాపం

99

ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినా నంద్యాలలో వాతావరణం వేడిగానే ఉంది. పోలింగ్‌ రోజు వైసీపీ కౌన్సిలర్‌ను కొట్టిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తాజాగా నూనెపల్లెలో ఇద్దరు మహిళలపై దాడికి తెగబడ్డాడు. టీడీపీకి ఓటేయలేదన్న కోపంతో మహిళలను కొట్టాడు. దాడిలో గాయపడిన ఇద్దరు మహిళలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఏవీ సుబ్బారెడ్డి అనచరులతో కలిసి నియోజకవర్గంలో తిరుగుతున్నారు.

వైసీపీ  కోసం గట్టిగా పనిచేసిన వారిని గుర్తించి వారిని బెదిరిస్తున్నారు. రెండు రోజుల క్రితం కూడా నంద్యాలలోని విశ్వనగర్‌కు చెందిన రాములమ్మ కుటుంబీకులు టీడీపీకి ఓటు వేయలేదన్న కోపంతో టీడీపీ వర్గీయుడు సుబ్బయ్య దాడి చేసి గాయపరిచారు. నిన్న ఏకంగా టీడీపీ నేత మధు శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులకు తెగబడ్డారు. నడిరోడ్డుపై వేటకొడవలితో స్వైర విహారం చేశాడు.

NEWS UPDATES

CINEMA UPDATES