మహేష్ న్యూ ఇయర్ గిఫ్ట్ రెడీ

179

ప్రతి ఏటా కొత్త సంవత్సరానికి తన అభిమానులకు ఓ బహుమతి అందించడం మహేష్ కు అలవాటు. ఈసారి కూడా అదే ఆనవాయితీ కొనసాగిస్తున్నాడు మహేష్. తన అప్ కమింగ్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ రెడీ చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ లేదా టైటిల్ ను డిసెంబర్ 31 అర్థరాత్రి విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమాకు భరత్ అనే నేను టైటిల్ తో పాటు మరికొన్ని పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే భరత్ అనే నేను టైటిల్ బాగా జనాల్లోకి చొచ్చుకుపోయింది కాబట్టి.. ఆ టైటిల్ తోనే లోగో డిజైన్ ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాణీ హీరోయిన్.

భరత్ అనే నేను సినిమా విడుదల తేదీపై ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తోంది. ఇంతకుముందే ప్రకటించినట్టు ఏప్రిల్ 27న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం లేదు. రజనీకాంత్, బన్నీ సినిమాలు కూడా అదే తేదీకి ఫిక్స్ అవ్వడంతో.. మహేష్ సినిమాను ఆ తేదీ నుంచి తప్పించే అవకాశాలున్నాయి.

NEWS UPDATES

CINEMA UPDATES