మహేష్, రకుల్ ఫారిన్ టూర్

793

మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ విమానం ఎక్కేశారు. ఫారిన్ టూర్ ప్లాన్ చేశారు. వారం రోజుల పాటు రొమేనియాలో విహరించబోతోంది ఈ జంట. అయితే ఇదంతా సినిమా కోసమే. సూపర్ స్టార్ మహేష్ బాబు రొమేనియా బయల్దేరాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. “రొమేనియా బయల్దేరాను. స్పైడర్ కు సంబంధించి ఓ సాంగ్ షూటింగ్ కోసం” అంటూ ట్వీట్ చేశాడు మహేష్.

మురుగదాస్ దర్సకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్, రకుల్ మధ్య ఓ రొమాంటిక్ నంబర్ షూట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ తో స్పైడర్ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది.

స్పైడర్ కు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా రెడీగా ఉంది. ఈ సినిమా టీజర్ ను ప్రత్యేకంగా వీఆర్ టెక్నాలజీ ఆధారంగా చూపించబోతున్నారు. కాకపోతే అది హాలీవుడ్ లో. ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం. లాస్ ఎంజెల్స్ లో ఉన్న హాలీవుడ్ స్టుడియోలో ఉన్న వీఆర్ బ్లాక్ లో  ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం రేపు “వీఆర్ టీజర్ ఎక్స్ పీరియన్స్” ప్రారంభించబోతున్నారు.

 

NEWS UPDATES

CINEMA UPDATES