మూత‌ప‌డ్డ జెమిని న్యూస్‌…. స‌న్ గ్రూపు సంచ‌ల‌న నిర్ణ‌యం

2462

త‌మిళ‌నాడు క‌రుణానిధి మేనల్లుడు ద‌యానిధి మార‌న్ చేతుల్లో ఉన్న స‌న్ గ్రూపు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తెలుగులో న‌డుస్తున్న జెమిని న్యూస్  ఆక్టోబ‌ర్ 24 నుంచి మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో పాటు క‌న్న‌డ న్యూస్ ఛాన‌ల్ ఉద‌య్ న్యూస్‌ను కూడా మూసివేయాల‌ని స‌న్‌గ్రూపు ఎప్పుడో నిర్ణయించింది. ఈ మేర‌కు ప్రభుత్వానికి కూడా నోటీసు అందజేసింది. నష్టాల కారణంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఎంటర్ టైన్ మెంట్ లో తిరుగులేని స్థానంలో ఉన్న జెమిని గ్రూపు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.  రేటింగ్స్‌లో చానల్ చాలా వెనుక‌బ‌డి ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని స‌న్ గ్రూపు చెబుతోంది. అయితే దీని వెనుక చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ చానల్స్‌కు పేరు లేక‌పోవ‌డం గ్రూపు ప్ర‌తిష్ట‌, ప‌రువుపై మ‌చ్చ ప‌డుతోంద‌ని సంస్థ పెద్ద‌లు అభిప్రాయానికి వ‌చ్చారు. ఈ చాన‌ల్స్ వ‌ల్ల న‌ష్టం రావ‌డం లేదు.  నెల‌కు ఖ‌ర్చు పెట్టే దాని కంటే 25 ల‌క్ష‌లు ఎక్కువ‌నే సంపాదిస్తున్నాయి. కానీ ప్ర‌భావితంగా లేక‌పోవ‌డంతో పాటు ప‌రువుకి భంగం వాటిల్ల‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

19 ఏళ్ల కింద‌ట ప్రారంభ‌మైన ఉద‌య్ న్యూస్ మూసివేత నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇటీవ‌ల క‌న్న‌డ‌లోకి టీవీ5తో పాటు కొత్త‌గా వ‌చ్చిన చాన‌ల్స్‌ను ఉద‌య్ త‌ట్టుకోలేక‌పోయింది. ఇటు తెలుగు జెమిని న్యూస్ చాన‌ల్ ఉంద‌నే సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. అర‌కొర సిబ్బందితో ఈ చాన‌ల్‌ను న‌డిపిస్తున్నారు. ఇప్పుడు ఈ చాన‌ల్స్ మూసివేత‌తో 500 మందికి పైగా ఉద్యోగులు రోడ్డున‌ప‌డ్డారు, అయితే త‌మిళ స‌న్ న్యూస్ చాన‌ల్ కూడా మూసివేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఆర్ధిక భారం తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా.. చివరకు మూడు న్యూస్ ఛానళ్ల మూసివేతకు నిర్ణయించింది.  క‌రుణానిధి కుటుంబానికి క‌లైంజ‌ర్ న్యూస్ చాన‌ల్ ఉండ‌డంతో రాజ‌కీయంగా కూడా త‌మిళ న్యూస్ చాన‌ల్ అవ‌స‌రం లేద‌ని ద‌యానిధి మార‌న్ సోద‌రులు అనుకుంటున్నార‌ట‌. వీటి వ‌ల్ల వ‌చ్చే లాభం కంటే ఇత‌ర ప‌రంగాన‌ష్టం ఎక్కువ ఉంటుంద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది.

NEWS UPDATES

CINEMA UPDATES