మైగ్రేన్ త‌ల‌నొప్పి…గుండెకు ముప్పు!

131

మైగ్రేన్ త‌ల‌నొప్పితో బాధ‌పడే మ‌హిళ‌ల్లో గుండె జ‌బ్బులు వ‌చ్చేఅవ‌కాశం పెరుగుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అంతేకాదు, గుండెజ‌బ్బుల బారిన ప‌డిన మ‌హిళ‌ల్లో మైగ్రేన్ ఉన్న‌వారు, అదిలేనివారికంటే మ‌ర‌ణించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఒకనూతన ప‌రిశోధ‌న‌లో వీరు క‌నుగొన్నారు. హార్ట్ ఎటాక్‌, స్ట్రోక్ ల‌కు మైగ్రేన్ అనేది కూడా ఒక కార‌ణ‌మ‌వుతున్న‌ట్టుగా వీరుక‌నుగొన్నారు.

జ‌ర్మ‌నీలోని ప‌బ్లిక్ హెల్త్ సంస్థ‌, అమెరికాలోని మరొక వైద్య సంస్థసంయుక్తంగా క‌లిసి మైగ్రేన్‌, గుండెవ్యాధులు, మ‌ర‌ణించే ప్ర‌మాదరేటు ఈ మూడింటికీ ఉన్న అనుబంధంపై ఒక అధ్య‌య‌నాన్నినిర్వ‌హించారు. 25-42 మ‌ధ్య వ‌య‌సున్న 1,15,541 మందిమ‌హిళ‌ల డేటాను విశ్లేషించి ఈ ఫ‌లితాన్నివెల్ల‌డించారు. వీరంద‌రిలో ఎలాంటి గుండె వ్యాధులు కానీ స‌మ‌స్య‌లు కానీ లేవు. అయితే ఈ మ‌హిళల్లో  17,531 మందికి మైగ్రేన్ ల‌క్ష‌ణాలు మొద‌ల‌వుతున్న‌ట్టుగా  ఫిజీష‌యన్లు నిర్దారించారు.

20 సంవ‌త్స‌రాల పాటు వీరిపైఅధ్య‌య‌నం నిర్వ‌హించ‌గా వీరిలో 1,329 మంది గుండె వ్యాధుల‌కు గురయిన‌ట్టుగా గుర్తించారు. తిరిగి ఈ 1,329 మందిలో 223 మందిగుండెవ్యాధి కార‌ణంగా మ‌ర‌ణించార‌ని తేలింది. మేగ్రేన్ లేనివారితో పోల్చితే మైగ్రేన్ ఉన్న‌వారిలో గుండెపోటు, స్ట్రోక్‌, యాంజినా, క‌రోన‌రీ వ్యాధులుఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని దీన్ని బ‌ట్టి తేలిందని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. గుండె వ్యాధులకు కార‌ణ‌మ‌య్యే ఇత‌ర అంశాల‌ను పరిగ‌ణ‌న‌లోకితీసుకుని పరిశీలించినా మైగ్రేన్‌కి గుండె వ్యాధుల‌కు సంబంధం ఉన్న‌ట్టుగా శాస్త్ర‌వేత్త‌లు నిర్దారించారు.

NEWS UPDATES

CINEMA UPDATES