మ‌నోజ్ కు రాజ్ త‌రుణ్ కుక్క పిల్ల‌ల‌తో ఝ‌ల‌క్‌…!

69

 

ఏదో ఒక కొత్త ద‌నం ఉండ‌టం అనేది ముఖ్యం.   దాన్నే న‌మ్ముకుని  వ‌స్తున్నారు కిట్టుఉన్నాడు జాగ్ర‌త్త టీమ్‌. వంశీ కృష్ణ  ద‌ర్శ‌క‌త్వంలో   రాజ్ త‌రుణ్ అను ఇమాన్యవ‌ల్  లీడ్ రోల్స్ లో   ఈ చిత్రం మార్చి  3 న రిలీజ్ అవుతుంది.   ఇదే రోజు మ‌నోజ్  న‌టించిన  గుంటూరోడు చిత్రం రిలీజ్ అవుతుంది. మంచి హిట్ కోసం  వెయిట్ చేస్తున్న మ‌నోజ్ ఈ సారి  పూర్తి స్థాయి యాక్ష‌న్  చిత్రంతో  అభిమానుల్ని అల‌రించ‌డానికి సిద్ద‌మైన‌ట్లు తెలుస్తుంది.

అయితే  కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త  సినిమా  చాలా డిఫ‌రెంట్  లైన్ తో పాటు.. వంద‌శాతం  వినోదం  ప్ర‌ధానం చేసుకుని సినిమా చేసిన‌ట్లు తెలుస్తుంది.  అర్బ‌న్  ఆడియ‌న్స్ కు  ఒక రేంజ్ లో క‌నెక్ట్ అయ్యే ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా   కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త చిత్రంలో క‌నిపిస్తున్నాయి. మ‌నోజ్ గుంటూరోడు రెగ్యుల‌ర్ మాస్ మ‌సాలా చిత్రం లా అనిపిస్తుంది.

ఒక వేళ రాజ్ త‌రుణ్ చిత్రం అర్బ‌న్ ఆడియ‌న్స్  కు క‌నెక్ట్ అయితే  బిజినెస్ ప‌రంగా   కిట్టు ఉన్నాడు చిత్ర‌మే ఎక్కువ  హిట్ అయ్యే అవ‌కాశం ఉంది. కేవ‌లం యాక్ష‌న్ ఎలిమెంట్స్ ను న‌మ్ముకుని వ‌స్తున్న  గుంటూరోడు కి  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర  గట్టి ఝ‌ల‌క్ ప‌డ‌టం ఖాయంగానే క‌నిపిస్తుంది అంటున్నారు ప‌రిశీల‌కులు.

NEWS UPDATES

CINEMA UPDATES