రజనీకాంత్ ప్రచారం షురూ

88
దాదాపు ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న 2.0 సినిమా ప్రమోషన్ ఈరోజు నుంచి అధికారికంగా మొదలైంది. అది కూడా ఇండియాలో కాదు. ఏకంగా అమెరికాలో. అవును.. అగ్రరాజ్యంలోని లాస్ ఏంజెల్స్ లో ఉన్న హాలీవుడ్ స్టుడియోస్ సమీపంలో 2.0 హాట్ ఎయిర్ బెలూన్ ను ఎగరేశారు. ఓ వైపు బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ బోర్డు కనిపిస్తుంటుంది. ఇటువైపు రజనీకాంత్ బొమ్మతో 2.0 బెలూన్ ఎగురుతుంటుంది. పొద్దుట్నుంచి ఈ పిక్స్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ అవుతున్నాయి.
తాజా కార్యక్రమంతో ఇకపై ప్రపంచవ్యాప్తంగా 2.0 ప్రమోషన్ చేపడతామని యూనిట్ ప్రకటించింది. దేశంలోని ముఖ్య నగరాలతో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఎక్కడ వీలైతే అక్కడ హాట్ ఎయిర్ బెలూన్లు  ఎగరవేస్తామని ప్రకటించారు. కేవలం ఈ వరల్డ్ టూర్ కోసమే 40 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.
త్వరలోనే దుబాయ్ లో ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను నిర్వహించబోతున్నారు. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ట్రయిలర్ ను విడుదల చేస్తారు. ఇక  సినిమాను రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయబోతున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES