రిపబ్లిక్‌ టీవీ కూడా అమ్ముడుపోయిందా?

508

వైసీపీ… బీజేపీతో కలుస్తుంది. కాంగ్రెస్‌తో కలుస్తుంది. అంటూ సరిగ్గా ఎన్నికలకుముందు ప్రచారం చేయడం టీడీపీ తొలి నుంచి ఒక పద్దతి ప్రకారమే చేస్తోంది. కడప ఉప ఎన్నికల్లో అక్కడ ముస్లిం ఓటర్లు అధికంగా ఉండడంతో వారు వైసీపీకి ఓటేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో వైసీపీ బీజేపీతో కలుస్తుందని అప్పట్లో టీడీపీ ప్రచారం చేసింది. 2014 ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్‌పై ప్రజల్లో ఉన్న కోపాన్ని వైసీపీ మీదకు కూడా మళ్లించే ఉద్దేశంతో ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, వైసీపీ కలిసిపోతాయంటూ ప్రచారం చేసింది టీడీపీ.

ఇప్పుడు తిరిగి ముస్లింఓటర్లు అధికంగా ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడంతో టీడీపీ మరోసారి ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. బీజేపీ నేతలు వస్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారన్న భయంతో నంద్యాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు పాల్గొనకుండా నిలువరించిన చంద్రబాబు… కాకినాడలో మాత్రం బీజేపీతో చట్టాపట్టలేసుకుని తిరుగుతున్నారు.  ఇదే సమయంలో నంద్యాలలో ముస్లిం ఓటర్లను ప్రభావితం చేసేందుకు బీజేపీతో వైసీపీ కలుస్తోందంటూ సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు టీడీపీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించారు. అయితే టీడీపీ అనుకూల పత్రికలు సొంతంగా రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో ఈసారి కొత్త ఎత్తు వేశారు.

సీనియర్ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడుస్తున్న రిపబ్లిక్‌ టీవీలో బీజేపీ- వైసీపీ కలుస్తాయంటూ స్టోరి వేయించారు. ఆ మరుసటి రోజే బీజేపీ- వైసీపీ కలుస్తున్నాయి… ఈ విషయాన్ని రిపబ్లిక్ టీవీ కూడా ప్రచారం చేసిందంటూ టీడీపీ అనుకూల పత్రిక మొదటి పేజీలోనే అచ్చేసింది. అయితే హఠాత్తుగా రిపబ్లిక్ టీవీ ప్రసారం చేసిన కథనంతో ఢిల్లీ స్థాయిలో  జర్నలిస్టులను వైసీపీ నేతలు ఆరా తీయగా  దీని వెనుక టీడీపీ లాబీయింగ్‌ చక్రం తిప్పినట్టు వారికి స్పష్టమైంది.

చంద్రబాబు లాబీయింగ్ టీంలో కీలక వ్యక్తిగా ఉన్న ఒక టీడీపీ ఎంపీ … అధినేత ఆదేశాల మేరకు  టీడీపీ పత్రికలో పనిచేసే ఒక జర్నలిస్ట్‌ చేత కథనాన్ని రాయించి దాన్ని రిపబ్లిక్ టీవీ చేతిలో పెట్టారు. సదరు స్టోరీ రిపబ్లిక్ టీవీలో ప్రసారం అయ్యేలా చేసేందుకు సదరు ఛానల్‌లో పనిచేస్తున్న ఒక కీలక వ్యక్తి సహకరించినట్టు సమాచారం. ఆ ఛానల్‌లో చక్రం తిప్పుతున్న వారిని ప్రలోభపెట్టి కథనాన్ని రాయించినట్టు వైసీపీ నేతలు నిర్ధారించుకున్నారు.

వైసీపీని ఎలాగైనా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇక్కడి పత్రికలు తన విశ్వసనీయతను పణంగా పెట్టి ఇప్పటికే తమ నిజాయితీని ఖర్చు పెట్టేశాయి. ఇప్పుడు ఆ పత్రికలు కట్టుకథలు రాస్తే నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో మీడియాను కూడా ప్రలోభపెట్టి  వాటి విశ్వసనీయతను టీడీపీ నేతలు వాడేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.  సరిగ్గా నంద్యాల ఎన్నిలకు రెండు రోజుల ముందు రిపబ్లిక్ టీవీ … అసందర్భ కథనాన్ని ప్రసారం చేయడం ముమ్మాటికి టీడీపీ కుట్రేనని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. 

మొత్తం ఈ కుట్ర కథ అంతా తెలుసుకున్న అర్నబ్ గోస్వామి ఆ స్టోరి తయారుచేసిన జర్నలిస్టుమీద ఎంక్వయిరీ వేశాడు. తెలుగుదేశం నేతలకు అతను ఎలా అమ్ముడుపోయి ఈ స్టోరి తయారుచేశాడో విచారించమని సీనియర్ ఉద్యోగులకు పురమాయించారు. రిపబ్లిక్ టీవి ఉద్యోగుల కథనం ప్రకారం ఆ స్టోరి తయారుచేసిన జర్నలిస్టుకు ఈరోజో రేపో ఉద్యోగం పోనుందట.

NEWS UPDATES

CINEMA UPDATES