రేపు మార్నింగ్‌షోకి వ‌స్తా విహెచ్‌…. తేల్చుకుందాం రా అని వ‌ర్మ స‌వాల్‌

106

అర్జున్‌రెడ్డి పోస్ట‌ర్ వివాదం చిలికిచిలికి గాలివాన‌గా మారింది. ఆ సినిమాతో సంబంధం లేని ఇద్ద‌రు వ్య‌క్తులు ఇప్పుడు బ‌స్తీ మే స‌వాల్ అంటున్నారు. ఒక‌రికొక‌రు స‌వాళ్లు విసురుకుంటున్నారు. హైద‌రాబాద్‌కు వ‌స్తే నీ అంతు చూస్తాన‌ని వ‌ర్మ‌కు విహెచ్ వార్నింగ్ ఇచ్చారు.  శుక్ర‌వారం ఉద‌యం ఐమాక్స్‌లో ఫ‌స్ట్ షో చూస్తున్నా… అర్జున్ రెడ్డి సినిమా చూస్తున్నా… ద‌మ్ముంటే రండి అంటూ విహెచ్‌కు వ‌ర్మ స‌వాల్ విసిరారు. దీంతో శుక్ర‌వారం ఉద‌యం ఐమాక్స్ చౌర‌స్తాలో ఏం జ‌ర‌గ‌బోతుంద‌నేది ఉత్కంఠ‌గా మారింది.

అర్జున్ రెడ్డి సినిమాలో  హీరో, హీరోయిన్లు ముద్దు పెట్టుకున్న పోస్ట‌ర్ అస‌భ్య‌క‌రంగా ఉంద‌ని విహెచ్ మండిప‌డ్డారు. బ‌స్‌పై ఉన్న పోస్ట‌ర్‌ను విహెచ్ చించివేశారు. అయితే ఈ వివాదంలోకి ఎంట‌రైన రాంగోపాల్ వ‌ర్మ విహెచ్‌పై సెటైర్లు వేశారు. దీంతో ముంబై లో ఉండి ఏదిప‌డితే అది మాట్లాడ‌టం కాదు, ఈ సారి హైద‌రాబాద్ లో ఎలా అడుగు పెడ‌తావో చూస్తా అంటూ రామ్ గోపాల్ వర్మకు వీహెచ్ వార్నింగ్ ఇచ్చారు. న‌న్ను హైద‌రాబాద్‌లో అడుగు పెట్ట‌నివ్వ‌రా… రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ఐమ్యాక్స్ లో అర్జున్ రెడ్డి మార్నింగ్ షో చూసేందుకు వ‌స్తున్నా… అక్క‌డ చూసుకుందాం.. బ‌స్తీ మే స‌వాల్’ అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ఛాలెంజ్ విసిరాడు. అర్జున్ రెడ్డి నిర్మాతలు మీకు పబ్లిసిటీ కోసం డబ్బులు ఇచ్చినట్టున్నారు. సంబంధిత అధికారుల్ని ఈ విషయంపై విచారించాల్సిందిగా కోరుతున్నాను’ అని సెటైర్లు విసిరారు.  మీ మనవళ్ల వయసున్నవాళ్లను రేపు అర్జున్ రెడ్డి థియేటర్లోకి వెళ్లకుండా చూడండి అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో రేపు వ‌ర్మ ఏం చేస్తారు?  విహెచ్ దానికి ఎలా రియాక్ష‌న్ ఇస్తాడ‌నేది ఉత్కంఠ‌గా మారింది.

NEWS UPDATES

CINEMA UPDATES