రోగాల‌ను ఢీకొనే…మామిడి!

143

ప‌ళ్ల రారాజు మామిడి రుచిక‌ర‌మే కాదు, ఇందులో మ‌నఆరోగ్యానికి మేలుచేసే మంచి ల‌క్ష‌ణాలున్నాయి. ప్ర‌తిరోజూ మామిడి ప‌ళ్ల‌ను నియ‌మిత మోతాదులోతిన‌టం వ‌ల‌న చ‌క్క‌ని లాభాలు పొంద‌వ‌చ్చు.

–ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు…కొలోన్‌, రొమ్ము, ల్యుకేమియా, ప్రొస్టేట్ క్యాన్స‌ర్లకు వ్య‌తిరేకంగాపోరాడ‌తాయి.

–ఇందులో అధికంగా ఉన్న  ఫైబ‌ర్‌, పెక్టిన్, విట‌మిన్ సిలు టోట‌ల్ బ్ల‌డ్ కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గిస్తాయి. చెడ్డకొలెస్ట్రాల్‌ని త‌గ్గించే గుణం కూడా ఇందులో చాలాఎక్కువ‌గా ఉంది.

–మామిడిని తిన్నా, చ‌ర్మానికి పై పూత‌గా అప్ల‌యిచేసినా చ‌ర్మ‌కాంతిని పెంచుతుంది. చ‌ర్మ రంధ్రాల‌ను శుభ్రం చేసి, మొటిమ‌లు రాకుండా నివారిస్తుంది.

–కంటిచూపుని మెరుగుప‌రుస్తుంది. ఒక క‌ప్పుడు మామిడి ముక్క‌లు తింటే ఒక రోజుకి మ‌న‌కు కావాల్సిన విట‌మిన్ ఎలోపావువంతు ల‌భిస్తుంది. ఎ విట‌మిన్ కంటి ఆరోగ్యానికి అవ‌స‌ర‌మైన పోష‌కం.

మామిడిలో  విట‌మిన్ ఎ, సి, బి2 ల‌తో పాటు పీచు, కాప‌ర్‌, పొటాషియం, మెగ్నీషియంలు కూడా పుష్క‌లంగా ఉన్నాయి. మామిడి అందుబాటులో ఉండే కాల‌మంతా వీటిని తీసుకోవ‌టం వ‌ల‌న మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన పోష‌కాల‌నుపొంద‌వ‌చ్చు.

NEWS UPDATES

CINEMA UPDATES