లైఫ్ ఇచ్చిన బ్యానర్ లో మరో సినిమా

109
హీరో రాజ్ తరుణ్ మరోసారి తనకు లైఫ్ ఇచ్చిన బ్యానర్ లో వర్క్ చేస్తున్నాడు. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మంచి విజయాన్నందుకున్న ఈ హీరో… మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమాను నిర్మించిన అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ తో కలిసి వర్క్ చేస్తున్నాడు. గౌతమ్ మీనన్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన రంజనీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఓ వైపు తన కొత్త సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త ప్రమోషన్ లో బిజీగా పాల్గొంటూనే.. మరోవైపు ఈ సినిమా షూటింగ్ కానిచ్చేస్తున్నాడు రాజ్ తరుణ్.
ఇక ఈ సినిమా కోసం తాజాగా హీరోయిన్ ను కూడా ఫిక్స్ చేశారు. చిత్ర అనే అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు. ప్రస్తుతం ఈ అమ్మాయి.. శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న మా అబ్బాయి అనే సినిమాలో నటిస్తోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా. ఈ సినిమా రిలీజ్ కాకముందే, అన్నపూర్ణ స్టుడియోస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో నటించే ఛాన్స్ కొట్టేసింది చిత్ర. త్వరలోనే ఈ సినిమా టైటిల్ తో పాటు.. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

NEWS UPDATES

CINEMA UPDATES